రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది : చంద్రబాబు

ప్రధానిని అయ్యే అవకాశాలు రెండు సార్లు వదులుకున్నా. నా రాష్రానికి సేవ చేయడమే నాకు ఇష్టం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు చెన్నైలో ఒక ఆంగ్ల ఛానల్ నిర్వహించిన సదస్సలో చంద్రబాబు పాల్గొన్నారు. తనకు యునైటెడ్ ఫ్రంట్ హయాంలో రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశమొచ్చినా వదులుకున్నానని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదన్న చంద్రబాబు దీనికి యూపీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కారణంగా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. రాజధానిని కూడా కొత్తగా నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే రాజధాని నిర్మాణం కోసం ప్రజలందించిన సహకారాన్ని మాత్రం తన జీవితంలో మరువలేనన్న చంద్రబాబు ఈ సందర్భంగా రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను కొనియాడారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1