ఫెర్టిలిటీ సెంటర్ పై ఐటీ దాడులు

పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టిస్తామని చెప్పే సంతాన సాఫల్య కేంద్రాలపై ఆదాయపు పన్నుశాఖ కన్ను పడింది. హైదరాబాద్ లోని డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం సంచలనం కల్గించింది. ఈ ఆసుపత్రి ప్రధాన కార్యాలయం యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో ఉంది. బ్రాంచి ఆఫీస్ హైదరాబాద్ లోని హబ్సీగూడలో ఉంది. రెండు చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆదాయానికి సంబంధించిన రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసులకు కూడా ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదు. ఇక్కడ అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది ఈ ఆస్పత్రికి వస్తున్నారని, అయినా ఆదాయపు పన్ను మాత్రం చెల్లించడం లేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా దీనిని చూసీ చూడనట్లు వదిలేశారు. తమ నోటీసులకు స్పందించకపోవడంతో ఐదుగురి బృందంతో కూడిన ఐటీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. భువనగిరి, హబ్సీగూడలో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1