ఏపీలో బీజేపీ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అవినీతి అధికారులను పట్టించిన వారికి పదివేలు క్యాష్ ను బహుమతిగా ఇవ్వడంతో పాటు ప్రధాని నరేంద్రమోడీతో సెల్ఫీ దిగే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విష్ణు మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. భూమిని కొనుగోలు చేయాలన్నా….విక్రయించాలన్ని సొమ్ములివ్వందే ఏపీలో పని జరగడం లేదన్నారు. రెవెన్యూ శాఖ భ్రష్టుపట్టిపోయిందని వ్యాఖ్యానించారు.

విష్ణుకుమార్ రాజు వద్దకు నిన్న ఓ వ్యక్తి వచ్చి తన భూమిని విక్రయించాలంటే తాహసిల్దార్ ఆరు లక్షలు లంచం అడుగుతున్నారని చెప్పారు. దీనికి ఆగ్రహించిన విష్ణుకుమార్ రాజు తన వద్ద ఉన్న లక్ష రూపాయలను ఆ వ్యక్తికిచ్చి ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. విశాఖలోని తహసిల్దార్ ఏసీబీకి లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు ఈ ప్రకటన చేశారు. అవినీతి తరిమేయాలంటే సమాజం సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీతో సెల్ఫీ దిగడంతో పాటు ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడు మొదటి వంద మందికి ఆయనను కలిసే అవకాశం కల్పిస్తానని కూడా విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది. అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్న విష్ణు ప్రకటనకు టీడీపీ నేతలు స్పందించలేదు. అవినీతి పై యుద్ధం చేస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన సోదరపార్టీ మిత్రుడు చేసిన సంచలన వ్యాఖ్యలకు ఏ విధంగా స్పందింస్తారో వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1