వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత మూడు రోజుల పాటు ఏపీ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్య అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనే ప్రధానంగా చర్చకు వచ్చింది.

ఏపీ శీతాకాల సమావేశాలను ఇంతవరకూ నిర్వహించలేదు. విజయవాడ సమీపంలోని వెలగపూడిలోనే సమావేశాలు ఇకపై నిర్వహిస్తామని గత సమావేశాల్లో సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో వెలగపూడి లో అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు అవి పూర్తయ్యే అవకాశముంది. దీంతో ఫిబ్రవరి నెలలో శీతాకాల సమావేశాలను మూడు రోజుల పాటు జరిపి…..మరో మూడు రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వసతిని కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి నెలలో జరిగే మహిళ పార్లమెంటేరియన్ సదస్సు పై కూడా వీరు చర్చించారు. మహిళ పార్లమెంటేరియన్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవలని సీఎం అధికారులకు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1