అమ్మ ఆస్తులు జనానికేనా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ప్రభుత్వం పరం చేసుకోవాలని మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో 117 కోట్ల రూపాయల విలువైన ఆస్తున్నాయని, జయకు వారసులెవ్వరూ లేకపోవడంతో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని తమిళనాడులోని సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రజల కోసమే పాటుపడుతున్నానని అనేకసార్లు చెప్పారని కూడా పిటిషన్ లో ఆ సంస్థ పేర్కొంది. పిటిషన్ తో పాటు ఆ సంస్థ జయకు సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించింది. ఈపిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. జయకు సంబంధించిన ఆస్తుల వారసులెవరో ఇంతవరకూ స్పష్టం కాలేదు. జయ సొంత నివాసమైన పోయెస్ గార్డెన్ లో ఆమె స్నేహితురాలు, అన్నాడీఎంకే కార్యదర్శి శశికళ ఉంటున్నారు. జయకు సంబంధించిన ఆస్తుల వారసులుగా ఇప్పటి వరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. జయ సొంత మేనకోడలు దీప కూడా వారసురాలినని ఇంతవరకూ ప్రకటించుకోలేదు. దీంతో జయ ఆస్తులు ప్రభుత్వం పరం అవుతాయా? వారసులెవరైనా వస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1