రాజధాని రైతులకు సంక్రాంతి కానుక

అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. ఎవరైతే భూములిచ్చారో వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూసమీకరణ చేసింది. వేలాది మంది రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. అందుకు ప్రతిగా ప్రతి ఎకరానికి వెయ్యి గజాల స్థలాన్ని రైతులకు ప్రభుత్వం కేటాయించింది. రాజధాని నిర్మాణం ప్రారంభమైతే భవిష్యత్తులో దీని ధర పెరుగుతందని ప్రభుత్వం చెప్పింది.

రాజధానికి భూములిచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల కేటాయింపు కూడా జరిగింది. అయితే తాము భూములిస్తే…వాటికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలను ఎందుకు చెల్లించాలని, మినహాయింపు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూములిచ్చిన రైతులు కేవలం వంద రూపాయలు ఫీజు చెల్లించి తమ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఎటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించనక్కర లేదని ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1