ఈ దర్శకుడు స్పీల్ బెర్గ్ తో సమానమంటున్న బాలయ్య 

43 సంవత్సరాల నట ప్రస్థానంలో అనేక మంది దర్శకులతో పని చేసిన నట సింహం నందమూరి బాల కృష్ణ తన అనుభవాల ద్వారా తాను దర్శకుల ధోరణిని గ్రహించింది ఏ మాత్రం దాపరికం లేకుండా చెప్పారు. కొందరి పేర్లు బైటకి చెప్పకుండా వారిని మాత్రం అబద్దాల పుట్టలని అభివర్ణించారు. రేపు(గురువారం) విడుదల కాబోతున్న బాలయ్య 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కి దర్శకత్వం వహించిన జాగర్లమూడి రాధా కృష్ణ (క్రిష్) ని చాలా ఉన్నతమైన, నాణ్యమైన సినిమాలు చేసే దర్శకుడి జాబితాలోకి చేరుస్తూ అతని పై ప్రశంసల వర్షం కురిపించారు బాలయ్య. దాదాపు అరడజను కథలు విన్న తరువాత తన 100 వ చిత్రానికి గౌతమీ పుత్ర శాతకర్ణి ని ఒప్పుకోవటం పై పరోక్షంగా జవాబిస్తూ దర్శకుల ధోరణి ఇందకు పరోక్ష కారణం అని తెలిసేలా సమాధానం ఇచ్చారు నందమూరి బాల కృష్ణ.

“గౌతమీ పుత్ర శాతకర్ణి చేయటానికి ముందు దర్శకుడు క్రిష్ చేసిన నాలుగు చిత్రాలను పరిశీలిస్తే అసలు ఒక దానికి ఒకటి పొంతన ఉండదు. ఆలా ప్రతి చిత్రానికి నూతన శైలి లో కథలు చెప్పటానికి ప్రయత్నం చేస్తుంటారు క్రిష్. మనం స్పీల్ బెర్గ్ చిత్రాలు చూసినా ఇలానే అనిపిస్తుంటుంది. క్రిష్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బెర్గ్ తో సమానమని నా అభిప్రాయం. ఆయన నాకు తొలి సారి కథ చెప్పినప్పుడే నేను ఈ చిత్రం చేయటానికి అంగీకరించాను. ఇక ఇదే పరిశ్రమలో మరి కొందరు దర్శకులు వుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకే తరహా చిత్రాలు చేస్తారు. అటువంటి వారు ఏ హీరో వద్దకు కథ తీసుకెళ్తే వారి కోసమే ఆ కథ తయారు చేపించామని అబద్దం ఆడుతుంటారు. అలా నా దగ్గరకి ఇతర కథానాయకుల కోసం తయారు చేసిన కథలని నా కోసమే సిద్ధం చేశామంటూ వచ్చారు. అటువంటి వారిని నేను పసిగట్టలేనను కోవటం వారి మూర్ఖత్వం. అందుకే వారికి కాల్ షీట్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఫ్రేమ్స్ వారికి ఇచ్చి గౌతమీ పుత్ర శాతకర్ణి ని 100 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాను.” అని 100 వ చిత్రానికి అనేక కథలు తిరస్కరించి గౌతమీ పుత్ర శాతకర్ణి ఎంచుకోవటం పై స్పష్టత ఇచ్చారు బాలయ్య.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1