దిల్ రాజు ప్రచారం ఇంత ఘోరంగా ఉందేమిటి?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాను నిర్మించే చిత్రాలతో పాటు తాను పంపిణి చేసే చిత్రాలకు కూడా భారీగానే ప్రచారం చేసుకుంటుంటారు. ఆయన నిర్మించిన కొన్ని చిత్రాలైతే కథ సాధారణంగా ఉన్నప్పటికీ అధిక ప్రచారం వల్ల ప్రేక్షకులకు చేరువయ్యి భారీ విజయాలు సాధించిన సందర్భాలు కూడా వున్నాయి. ఇక సంక్రాంతి బరిలో తాను నిర్మించిన శతమానం భవతి రెండు భారీ చిత్రాల మధ్య నలిగిపోతున్నది అని తెలిసినా కథ పై వున్న అపారమైన నమ్మకం తో సంక్రాంతి కే రిలీజ్ చెయ్యటానికి పూనుకున్నాడు దిల్ రాజు. పండుగకి చిరు 150 మరియు బాలయ్య 100 వ చిత్రాలు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ గా భారీ క్రేజ్ ని సంపాదించుకోవటమే కాక ఓపెనింగ్స్ నుంచి ఫుల్ రన్ షేర్ వరకు ఆ రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి.

ప్రస్తుతం తెలుగు న్యూస్ ఛానెళ్లలో కూడా వరుసగా చిరంజీవి-వినాయక్, బాల కృష్ణ-క్రిష్ ల ఇంటర్వ్యూ లు, గౌతమీ పుత్ర శాతకర్ణి, ఖైదీ నెం.150 చిత్రాల ప్రచార కార్యక్రామాలే ప్రసారమవుతున్నాయి. ఈ హైప్ ధ్యాసలోకి వెళ్ళిపోయినా సగటు ప్రేక్షకుడు దిల్ రాజు చెప్పిన శతమానం భవతే కథా గొప్పతనం గురించి మర్చిపోయాడు. శతమానం భవతే కి సంబంధించిన వారెవరు ఇంటర్వ్యూ లు ఇవ్వటం కానీ, ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం, పాల్గొనటం వంటివి చేయకపోవటంతో శతమానం భవతే ఆడియో వేడుక సమయానికి ఏర్పడ్డ కొద్దీ పాటి పాజిటివ్ బజ్ ఇప్పుడు కనిపించట్లేదు. పైగా ఈ చిత్ర ట్రైలర్ చుసిన నాటి నుంచి గోవిందుడు అందరివాడేలే కథనే మళ్లీ తెరకెక్కించారని అభిప్రాయం అందరిలో ఏర్పడిపోయింది. ఇంకా కేవలం రెండు రోజుల వ్యవధిలో విడుదల కానున్న శతమానం భవతి చిత్రానికి ఇప్పుడు దిల్ రాజు మార్క్ పబ్లిసిటీ చాలా అవసరం గా కనిపిస్తుంది. మరి దిల్ రాజు ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బైటకి ఎప్పుడు వస్తాడో మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1