ఈ సీఎంను కేంద్రం పక్కన పెట్టిందా?

మధ్యప్రదేశ్ ముఖ్యంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారా? రైతు ఉద్యమం సమయంలో తనకు కేంద్రం సహకరించడం లేదని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో రైతు ఉద్యమం ఊపందుకున్న సమయంలో రాష్ట్రంలో శాంతి నెలకొలాలని కాంక్షిస్తూ 28గంటల దీక్ష చేశారు చౌహాన్. దీక్ష చేసే సమయంలో గాని, ముగించే సమయంలోనూ కేంద్ర మంత్రులు సయితం మధ్యప్రదేశ్ వైపు తొంగి చూడలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం తనను కావాలనే పక్కన పెడుతున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ లో రైతు రుణమాఫీని ప్రకటించేందుకు కూడా అక్కడి నుంచి అనుమతి రాలేదు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన రైతు కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటిచడం పట్ల కేంద్రం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శివరాజ్ సింగ్ చౌహాన్ ను కేంద్రం పక్కన పెట్టిందా…? అన్న అనుమానాలు బలంగా విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1