టీడీపీలో కలకలం రేపిన బీజేపీ నేత లేఖ

పార్టీలు మారుతూ వచ్చిన వారే భూదందాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అటువంటి వారికి అవకాశమివ్వ వద్దంటూ ఆయన కోరారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణం, ఇసుక మాఫియాలో నేతల హస్తం వంటి అంశాలను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించినవే కావడం విశేషం. ఇదే విషయాన్ని అయన్నపాత్రుడు కూడా ప్రస్తావించారు. విశాఖలో భూములను బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. అయితే సోము వీర్రాజు మాత్రం బయట నుంచి వచ్చిన వారు అనకుండా పార్టీలు మారుతూ వస్తున్న వారే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.మొత్తం మీద బీజేపీ నేత లేఖ అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1