బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గా రామ్ నాధ్

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా రామనాధ్ కోవింద్ ను ఎంపిక చేశారు. ఈరోజు సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రామనాధ్ కోవింద్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాధ్ గతంలో యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు రామ్ నాధ్. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా రామ్ నాధ్ పనిచేశారు. అనూహ్యంగా రామ్ నాధ్ పేరు తెరపైకి వచ్చింది. దళితులకు రాష్ట్రపతి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని బీజేపీ భావించింది. రామ్ నాధ్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 1994లో తొలిసారి రాజ్యసభ కు ఎంపికయిన రామ్ నాద్ దళితుల సమస్యలపై పోరాటం చేశారు. రామ్ నాధ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. దీంతో విపక్షాలు కూడా ఈ ఎన్నికకు ఏకగ్రీవం జరిగేందుకు సహకరిస్తాయని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1