నారా లోకేష్ గొప్ప ఛాన్స్ మిస్సయ్యారు

ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఓటును వినియోగించుకునే అవకాశమే లేదు. అవును…ఇది నిజమే…రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడుఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. వారందరికీ పోలింగ్ ప్రక్రియను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటును చంద్రబాబే వేయనున్నారు. పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఓటు వేయాలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. పేపర్ బ్యాలెట్ తో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేయాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ఓటు హక్కు వినియోగించే అవకాశం లేదు.

ఎమ్మెల్సీకి ఓటేసే అవకాశం లేదు……

ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేలకు, ఎంపీలకుమాత్రమే ఓటు వేసే వీలుంది. ఎమ్మెల్సీలకు ఆ అవకాశం లేదు. నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి బాధ్యతలను చేపట్టడంతో ఆయన నేడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అలాగే మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా ఈ అవకాశం లేదు. నారా లోకేష్ రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న ఈ ఎన్నికల్లో నారా లోకేష్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. నేటి ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదుగంటల వరకూ పోలింగ్ జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1