నేడు నెరవేరనున్న మోడీ కల

భారత్ లో బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన నేడు జరగనుంది. ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ కు నడవనున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు శంకుస్థాపన ఈరోజు చేస్తారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య 500 కిలోమీటర్ల దూరం. ఈదూరాన్ని బుల్లెట్ ట్రయిన్ కేవలం 2 గంటల్లోనే చేరుకోవడం విశేషం. భారత్ లో ఇది తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కానుంది. 2022కు ఈ బుల్లెట్ ట్రైన్ పట్టాల మీద నడవాలన్నది ప్రధాని మోడీ ఆకాంక్ష. ఇందుకోసం లక్షా ముప్ఫయి వేల కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం వెచ్చించనుంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో బుల్లెట్ ట్రయిన్ ను తీసుకురావాలని భావించారు. ఈ మేరకు ఆయన జపాన్ ప్రధానితో కలిసి ప్రాజెక్టుకు మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు.

అనేక ఒప్పందాలు….

అలాగే జపాన్ ప్రధాని షింజో రెండు రోజుల భారత్ పర్యటనలో వివిధ అంశాలపై భారత్-జపాన్ ల మధ్య అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. జపాన్ కు చెందిన యు.ఎస్ 2 విమానాల కొనుగోలుపై భారత్ ఆసక్తి చూపుతోంది. ఈరోజు వీటిపై ఒప్పందం జరిగే అవకాశముంది. అలాగే భారత్-జపాన్ మధ్య వాణిజ్య చర్చలు కూడా జరగనున్నాయి. ఒక్క గుజరాత్ లోనే జపాన్ 15 అంశాలపై పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఒప్పందాలపై ఇరువురు ప్రధానులు సంతకాలు చేయనున్నారు. ఈరోజు జపాన్-భారత్ ల మధ్య జరిగే ఒప్పందాలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.

.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1