నేను యుద్ధం కూడా చేస్తా అంటుంది!

బాహుబలి వంటి ప్రెస్టీజియస్ చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ప్రభాస్ ఈ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ నిర్మాణంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రద్ద నటిస్తుంది అని అనుకున్నప్పటినుండి ఈ సినిమాపై అనేకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవేంటి అంటే ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ డ్యూయల్ రోల్ లో నటిస్తుంది అనే న్యూస్ తాజాగా సినిసర్కిల్ లో ప్రచారం అయింది.

అయితే ఈ విషయం పై హీరోయిన్ శ్రద్ధ కపూర్ పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది. సాహో చిత్ర షూటింగ్ లో జాయిన్ అయిన శ్రద్ద కపూర్ సాహో సినిమాలో నాది చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అని…. మీడియాలో వచ్చినట్లు నేను ఇందులో డ్యూయల్ రోల్ లో నటించడం లేదు, కేవలం ఒక్క పాత్ర లో మాత్రమె నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో నేను ఒక పాత్ర లో నటించినప్పటికీ ఈ సినిమాలో నాది మాత్రం చాలా కీలకమైన పాత్ర అని చెప్పింది. అలాగే ఈ సినిమాలో నేను యుద్ధం కూడా చేయబోతున్నాను అంటూ తనపై సాహో గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిందీ… బాలీవుడ్ భామ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1