సినిమా టేకింగ్ విషయంలో జక్కన్న ప్లాన్స్

దర్శకుడు రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడు అంటే ముందుగానే తన టీమ్ ని స్ట్రాంగ్ గా ఉంచుకుంటాడు. ఒకవేళ ఆలా కుదరకపోయిన వాళ్ళని తనకు నచ్చేలా మలుచుకోవడం జక్కన్నకి అలవాటే. అయితే తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ – రామ్ చరణ్ సినిమా కోసం కూడా ఓ టీం ని సెట్ చేసుకుంటున్నాడట.

ఈ సినిమాకు తన టీంని రెండు భాగాలుగా విడగొట్టాడట రాజమౌళి. ఈ సినిమాకు రాజమౌళి తన తండ్రి తో స్టోరీ డిస్కషన్ లో బిజీగా వున్నాడు. అయితే రాజమౌళి రెండు టీమ్స్ ను రెడీ చేసుకున్నాడట. ఒక టీమ్ మొత్తం రామ్ చరణ్ కి సంబందించిన టెస్ట్ సీన్స్ ని మరొక టీమ్ ఎన్టీఆర్ సీన్స్ ని టెస్ట్ షూట్ చేయనుందట. ఆ తర్వాత రెండు టీమ్స్ తీసిన సీన్స్ బట్టి దర్శకధీరుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంట.

ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిచాలని…. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ తో సినిమా ఉండబోతుంది కనుక సినిమా విషయంలో జాగ్రత్తలు పాటించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఎవరి ఉహలకందని సీన్స్ ఇందులో ఉన్నాయట. మరి రాజమౌళి ఏ విధంగా ప్లాన్ చేస్తాడో చూడాలి. మల్టి స్టారర్ సినిమా చేయాలంటే పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఏ ఒక్క హీరోని తక్కువగా చూపించినా అభిమానులు హర్ట్ అవుతారనే టెన్షన్ చాలా ఉంటుంది. మరి రాజమౌళి ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1