ABOUT US

As a digital media platform, we deeply committed to in-depth analysis of contemporary issues, report and comment on news of public interest. We firmly believe in old-fashioned journalisam in reporting, analyzing and commenting on the issues of state and national interest.

Firmly committed to report unbiased news as it happens and we show at most respect to democratic values, privacy and dignity of citizens while reporting.

We consistently thrive to build this platform as top choice for source of the information to provide issues of public interest, happenings in diaspora ( US, Canada, UK, Australia, New Zealand, Middle-East etc ), Sports, Health, Education, Life Style etc…

We always try  to bring the news with greater speed and accuracy. Our editorial team opinions are widely acclaimed by the readers.
www.telugupost.com in english
and 
http://telugu.telugupost.com in telugu is already a top of choice of the readers for realtime news and in-depth analysis.

Why Telugu Post ?

వార్త పవిత్రమైనది. అభిప్రాయం స్వేచ్ఛాయుతమైనది. ఆ వార్తకే స్వేచ్ఛ కల్పిస్తే స్వచ్ఛంగా, స్సష్టంగా, నిష్పాక్షికంగా, నిజాయతీగా సమాజానికి నిలువుటద్దమై నిలుస్తుంది. రాజకీయాల రంగు తేలుస్తుంది. ప్రజాప్రయోజనాలకు పట్టం గడుతుంది. అదే లక్ష్యం, అదే గమ్యంగా వార్తా ప్రపంచాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది తెలుగు పోస్టు. మాకు పార్టీల పాక్షిక సత్యాలు వద్దు. కులమతాల అడ్డుగోడలు లేవు. నిలదీసే నిజాలే మా తెలుగు పోస్టు అందించే సేవ. ఆలోచనలు రేకెత్తించే అభిప్రాయాలే మా పోర్టల్ తలకెత్తుకున్న బాధ్యత.

ఇందుకుగాను వివిధ ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవమున్న సీనియర్ జర్నలిస్టుల బృందం స్వచ్చందంగా సేకరించే, సమీకరించే వార్తలను సవివరంగా, విశ్లేషణాత్మకంగా మీ కందిస్తోంది తెలుగు పోస్టు. యాజమాన్యాల రాజకీయ పాక్షిక దృష్టి సోకకుండా పక్కా ప్రొఫెషనలిజం మా జర్నలిజం అని చాటుకోవాలన్నదే మా ఇజం. ఇందుకుగాను వ్యయప్రయాసలకోర్చి గంట గంటకూ అప్ డేట్ చేస్తూ వార్తా ప్రపంచంతో మిమ్మల్ని అనుసంధానించడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇది మాకు ఆదాయమార్గం కాదు. హాబీ మాత్రమే. ఎడతెగని అభిరుచి. తెలుసుకోవాలన్న తృష్ణ, తెలియచెప్పాలన్న తపన నిండుగా ఉన్న చిన్న బృందం మాది.

మంచిచెడుల గుట్టుమట్లను మీ ముందు ఆవిష్కరించడము మాకు తృప్తినిస్తుంది.అశేష పాఠకుల అభిమానధనమే ఇంధనంగా అక్షరాల అంతరంగాన్ని వెలికి తీసి నిజానిజాల లోతుపాతులు అన్వేషించి తెలుగుపోస్టు పాఠకులకు అందిస్తాం. తులనాత్మకమైన వార్తలతో అన్నిపార్టీలకు సమ దూరం పాటిస్తాం. అన్నిపక్షాలకూ సమన్యాయం చేస్తాం.

విమర్శ మాకు అక్షరాయుధం. అది విపక్షమైనా, అదికారపక్షమైనా అక్షరం ముందు అంతా సమానమే. వాస్తవాలనే వడ్డించాలన్న తపన తనువెల్లా దహించి వేసే జర్నలిస్టుల బృందమే మా బలం. బలగం. వాణిజ్యప్రకటనలు, ప్రలోభాలు, పదవులు, మామూళ్లు, కాంట్రాక్టులు, మనీ మాయాజాలాలు, కుల,వర్గ సమీకరణలతో కుళ్లిపోతున్న వార్తా ప్రచురణ, ప్రసారాలకు ఒక ప్రత్యామ్నాయం కావాలని మనసా వాచా కర్మణా నమ్మిన సిద్దాంతమే మా విధానం.

ప్రధాన స్రవంతి మాధ్యమాలు పక్కదారి పడుతున్న పరిస్థితుల్లో ప్రజాసమాచారాన్ని ఇచ్చేదెవరన్న ప్రశ్నకు బదులే మా తెలుగు పోస్టు. మా కృషికి మీ ఆదరణే ఆశీర్వాదం. మేమే తప్పుదారి పడుతున్నామని భావించిన క్షణాన హెచ్చరించి అప్రమత్తం చేసే అధికారమూ మీదే. ఈ చిన్నారి అక్షర వేదికను అక్కున చేర్చుకుని ఆదరించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీ పొత్తిళ్లలో పెంచి పెద్ద చేస్తారని ఆశిస్తూ..అభ్యర్థిస్తూ..

మీ తెలుగు పోస్టు