Fri May 03 2024 14:32:00 GMT+0000 (Coordinated Universal Time)
అఖిల ప్రియ డెడ్ లైన్... అలా చేయకపోతే?
భూమా అఖిలప్రియ వైసీపీ ఎమ్మెల్యే కు డెడ్ లైన్ పెట్టారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు
భూమా అఖిలప్రియ వైసీపీ ఎమ్మెల్యే కు డెడ్ లైన్ పెట్టారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమని ఆమె చెప్పారు. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో ఎమ్మెల్యే వసూళ్లు చేశారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిని తాను నిరూపించకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆమె సవాల్ విసిిరారు.
నేను రెడీ....
అదే సమయంలో తాను అవినీతిని నిరూపిస్తే ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం చేస్తారా? అని నిలదీశారు. ఎమ్మెల్యే రోడ్ల విస్తరణ పేరుతో అవినీతికి పాల్పడినట్లు తన వద్ద ఆధారాలున్నాయని, కలెక్టర్ వద్దకు వస్తే తాను నిరూపిస్తానని, ఇందుకు ఎమ్మెల్యేకు రెండు రోజలు సమయం ఇస్తున్నట్లు అఖిలప్రియ తెలిపారు. ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా ధర్నాకు దిగబోతునట్లు కూడా ఆమె ప్రకటించారు.
Next Story