ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

బాల‌య్య అంత సాహ‌సం చేస్తారా?

10/04/2018,03:00 సా.

`ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. అందులో ప్రతి పేజీ ఆంధ్రులంద‌రికీ తెలుసు` మ‌హాన‌టుడు, టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు నందమూరి తారక‌రామారావు బ‌యోపిక్ అనౌన్స్ చేసిన స‌మ‌యంలో అంత‌టా వినిపించిన మాట‌. ఆయ‌న జీవితానికి దృశ్యరూపం ఇచ్చేందుకు ఆయ‌న త‌న‌యుడు. ఎమ్మెల్యే బాల‌కృష్ణ తీస్తున్న సినిమాలో.. తండ్రి పుస్తకంలో మరుగున ప‌డిపోయిన [more]

వైసీపీలో ఎంట్రీకి బ్రేకులేస్తున్నదెవ‌రు?

10/04/2018,02:00 సా.

టీడీపీలో త‌గిన ప్రాధాన్యం లేకుండా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి వైసీపీలోకి వెళ‌తార‌నే ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్న పాద‌యాత్రలోనే ఆ టీడీపీ నాయ‌కుడు సైకిల్ దిగి.. వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌నే స‌మాచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కీల‌కమైన [more]

ఢిల్లీ నుంచి ఓవ‌ర్ టు ఏపీ

10/04/2018,01:00 సా.

హోదా పోరాటంలో టీడీపీ వెనుక‌బ‌డిపోయిందనే విమర్శలు. మ‌రోప‌క్క ప్రతిప‌క్ష వైసీపీ రేసులో ముందు వెళిపోతోంద‌నే ప్రశంస‌లు! మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసినా.. ఇక త‌ప్పక చేయాల్సి వ‌చ్చింద‌నే వ్యంగ్యాస్త్రాలు.. నాలుగేళ్లుగా గుర్తు రాని హోదా పోరాటం ఇప్పుడే గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నలు!! ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము [more]

ఇలాగైనా వర్క్ అవుట్ కావాలని …!

10/04/2018,12:00 సా.

నెత్తి నోరు కొట్టుకుంటున్నా కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. తాను పోతే పోయింది. పోతు పోతూ టిడిపి ని కూడా నిండా ముంచినంత పనిచేసింది. బాబు కి ముందు చూపు ఉండబట్టి గుడ్డిలో మెల్లలా పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అయినా కానీ [more]

జగన్ ముందున్న సవాల్ ఇదే

10/04/2018,11:00 ఉద.

ఇప్పుడు వైసీపీ ముందు పెద్ద సవాలే ఉంది. తమ ఎంపీలు చేసిన రాజీనామాలను ఆమోదించుకోవడం. ఈ నెల 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్ లోనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమరణ దీక్షకు దిగారు. అయితే వైసీపీ [more]

కంచుకోట‌లో టీఆర్ఎస్‌కు షాక్‌… కీల‌క లీడ‌ర్ గుడ్ బై..!

10/04/2018,10:00 ఉద.

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది వ‌రంగ‌ల్. అయితే ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, కేసీఆర్ తో వెన్నంటి నడిచిన నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పుడిదే అంశం ఉమ్మడి వరంగల్ [more]

పవన్ కార్యక్షేత్రం అదేనా?

10/04/2018,09:00 ఉద.

వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఎక్కడ గట్టి పట్టు పట్టాలన్న పనిలో పడ్డారు జనసేనాని. అందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ సాగుతున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రధానంగా వైసిపి టిడిపి లకు పట్టున్న రాయలసీమను తన కార్యక్షేత్రంగా అందుకే పవన్ మలుచుకుంటున్నారా ? అనే సందేహం విశ్లేషకులు వ్యక్తం [more]

చంద్రబాబు ఎన్నికలకు రెడీ అయినట్లేనా?

10/04/2018,08:00 ఉద.

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు దాదాపుగా సిద్దమయిపోయారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంట్ గా ఉన్న ప్రత్యేక హోదాను క్యాష్ చేసుకునే దిశగా ముఖ్యమంత్రి వ్యూహరచన చేశారు. ఏడాది పాటు ఉద్యమం సజీవంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీని [more]

ఆళ్లకు అండగా జగన్

10/04/2018,07:00 ఉద.

తనకు నమ్మకంగా నిలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అండగా నిలిచేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గం గత ఎన్నికలలో వైసీపీయే విజయం సాధించింది. అయితే అతి స్వల్ప మెజారిటీతో ఏదో బయటపడ్డామంటే బయటపడ్డామన్న తరహాలో వైసీపీ గత [more]

పక్కలో బల్లెంలా తయారయ్యాడే…!

10/04/2018,06:00 ఉద.

ఒకరు ఎమ్మెల్యే….మరొకరు ఎమ్మెల్సీ…ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. కాని ఉప్పు…నిప్పు..లా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ గులాబీ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం వీరి పంచాయతీని పరిష్కరించలేక పోతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. నిజామాబాద్ [more]

1 500 501 502 503 504 805