ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

కాపు వెర్సస్ యాంటీ కాపు : కులాల చిచ్చు రగుల్తోంది!

17/10/2016,06:51 సా.

కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే చంద్రబాబునాయుడు ఉద్దేశం మంచిదే కావచ్చు. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీఓ ఇచ్చేయడం కాకుండా, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండడానికి కూడా కాపు కమిషన్ ను ఏర్పాటుచేసి.. వారిని బీసీల్లో చేర్చే విషయమైన రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ రకంగా పద్ధతి ప్రకారం [more]

అందరూ వెళ్తూనే ఉంటే వైకాపా ఇమేజి దెబ్బతినదా?

17/10/2016,02:38 సా.

అధికారదండం చేతిలో లేనప్పుడు, పార్టీ బలగాలను శ్రేణులను కాపాడుకోవడం కూడా చాలా కష్టసాధ్యమైన పని. పార్టీ గుర్తు మీద గెలిచిన చట్టసభల ప్రతినిధులే అధికారం అండచూసుకుని పాలక పార్టీల్లోకి ఫిరాయించేస్తున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు గడ్డు స్థితే ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి [more]

చినబాబు ముందుచూపు ఎప్పటికీ కాపాడుతుంది!

17/10/2016,12:00 సా.

ప్రపంచంలో అత్యంత తీయనైనది పొగడ్త అని ఒక సామెత. ఎదుటి వారిని ఇంప్రెస్ చేసి, బుట్టలో పడేయడానికి, వారిని ప్రసన్నులను చేసుకుని కాగల కార్యాలు నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇదంతా క్రమంగా వ్యక్తిపూజకు దారితీస్తూ ఉంటుంది. రాజకీయాల్లో అయితే వ్యక్తిపూజ పరాకాష్టగా ఉంటుందనేది అందరికీ తెలిసిన [more]

కేజ్రీవాల్.. కులాల ప్రాపకం కోసం కొత్తగా వెంపర్లాట!

17/10/2016,08:58 ఉద.

‘చీపురు’ ను  పార్టీ గుర్తుగా పెట్టుకుని , సివిల్ సర్వీసెస్ మాజీ అధికారిగా, అన్నా హజారే అనుచరగణంలో ఒకడిగా అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్‌ఆద్మీ’ పార్టీతో రాజకీయ తెరంగేట్రం చేసినప్పుడు ఈ రంగంలో ఉన్న చెత్తనంతా ఆయన ఊడ్చిపారేస్తారని అందరూ ఆశించారు. ఢిల్లీలో అనూహ్యంగా ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ [more]

పవన్ కోర్కెలపై బాబు : ఒకటి ఎర్రజెండా మరొకటి పచ్చజెండా!

16/10/2016,04:45 సా.

భీమవరం వద్ద ఏర్పాటు అవుతున్న ఆక్వా ప్రాసెసింగ్ పార్క్ విషయంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్నా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్వరంతో హెచ్చరించిన నేపథ్యంలో 24 గంటల్లోనే దాని ఫలితం కనిపించింది. ఇదివరకు కూడా జనసేన తరఫున రెండు బహిరంగ సభలు పెట్టినప్పటికీ.. పవన్ కల్యాణ్ [more]

వెలగపూడి తలదన్నడమే తొలి ప్రాధాన్యమా?

16/10/2016,04:25 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగర నిర్మాణాల కోసం జరుగుతున్నంత హడావిడి ఇక్కడ ఎరగం కానీ.. తెలంగాణలో కూడా గుట్టు చప్పుడు కాకుండా అధికారిక భవనాల నిర్మాణాలు, మరికొన్ని కొత్తవాటికోసం ప్రణాళికలు రెడీ అయిపోతున్నాయి. ఒకరకంగా చూస్తే.. అన్ని రకాలుగానూ ఆంధ్రప్రదేశ్‌ను తలదన్నేలా తమ రాష్ట్రంలోని వ్యవహారాలు ఉండాలని ముఖ్యమంత్రి [more]

కొత్త భయం : వెంకన్న సన్నిధికి పోలవరం డిజైన్లు!

16/10/2016,07:06 ఉద.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మరో కీలకమైన ముందడుగు ఇవాళ పడబోతోంది. పోలవరం పనులను సకాలంలో.. అనుకున్న రీతిగా పూర్తి కావాలని కోరుతూ.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. పోలవరం డిజైన్లను స్వామివారి సన్నిధిలో ఉంచి , స్వామి కటాక్షం దక్కేలాగా [more]

వార్నింగ్ ఇచ్చింది కూడా కొడుకు మీద ప్రేమతోనేనా?

15/10/2016,10:09 సా.

దేశ రాజకీయాల్లో రెండు మూడు రోజులుగా కీలకంగా చర్చనీయాంశంగా ఉన్న అనేక విషయాల్లో ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. తన కొడుకు అఖిలేష్ ను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు కాదు [more]

పోరుబాట ఖరారు చేసుకున్న టీకాంగ్రెస్ !

15/10/2016,08:59 సా.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. అధికార తెరాస మీద అలుపెరగని పోరాటం చేస్తే తప్ప వచ్చే ఎన్నికల నాటికి తమ అస్తిత్వం కాపాడుకోవడం కష్టం అనే సంగతి వారికి అర్థమైపోయింది. పూర్తిగా ప్రజలకు రైతులకు సంబంధించిన ఎజెండా అంశాలను తీసుకుని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో [more]

అసహజ డిమాండ్‌తో ఎన్నాళ్లీ పోరాటం?

15/10/2016,07:55 సా.

రాజకీయాల్లో ఎలాంటి డిమాండ్‌లు అయినా సరే.. కాలగమనంలో మరుగున పడిపోతూ ఉంటాయి. పార్టీలు మళ్లీ కొత్త అంశాలు భుజానికెత్తుకుని ప్రజలను ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో పడుతుంటాయి. ఆచరణ సాధ్యం కాని కొన్ని డిమాండ్లను  కూడా రాజకీయ మైలేజీ కోసం కొన్ని సందర్భాల్లో వినిపించినప్పటికీ.. పార్టీలు వాటిని త్వరగానే వదిలించుకుంటూ [more]

1 662 663 664 665 666 669