స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

ఇద్దరు చంద్రుల ఇరకాటం…

16/06/2019,09:00 సా.

ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అట్టర్ ప్లాఫయ్యారు. 2019 ఎన్నికలు తమ దశ, దిశ మార్చేస్తాయని భ్రమ పడి బోర్లా పడ్డారు. కలలు కల్లలయ్యాయి. తమ సామర్థ్యాన్ని మించి ఎగిరేందుకు ప్రయత్నించి వైఫల్యం చెందారు. దేశంలోని రాజకీయ వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేక చతికిలపడ్డారు. [more]

రాజ‌కీయ స‌న్యాసం దిశ‌గా ఆ న‌లుగురు

16/06/2019,12:00 సా.

వారంతా రాజ‌కీయ ఉద్ధండులు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ చ‌క్రం తిప్పిన నాయ‌కులు. ఎదురులేని ప్ర‌జాభిమానాన్ని ఒకనాడు సొంతం చేసుకున్నారు. తిరుగులేని విధంగా రాజ‌కీయాల్లో త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం పొలిటిక‌ల్ స‌న్యాసం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వారే స‌బ్బం హ‌రి, కొణ‌తాల రామ‌కృష్ణ‌, రాయ‌పాటి సాంబ‌శివరావు, అయ్య‌న్నగారి [more]

పవన్ కి జేడీ లక్ష్మీ నారాయణ ఝలక్ ఇస్తారా ?

16/06/2019,08:00 ఉద.

జేడీ లక్ష్మీ నారాయణ . ఇంటి పేరేంటో కానీ జేడీయే పేరుగా చేసుకుని రాజకీయంగా దున్నేయాలనుకుని వస్తే సీన్ రివర్స్ అయింది. విశాఖలో అనూహ్యంగా కాలుమోపి జనసేన తరఫున జేడీ పోటీ చేస్తారని బహుశా ఆయన కూడా వూహించి ఉండరు. నిజానికి ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ సర్వీస్ ఉండగానే తొందరపడి [more]

ప్రసంగం..భేష్..పైసలో..?

15/06/2019,09:00 సా.

సంక్షేమ మంత్రం పఠించారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వప్రాధాన్యాలను వెల్లడించారు. పేదల సంక్షేమం, పాలనలో సంస్కరణ, పనుల్లో పారదర్శకత కొత్త ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన మాటలతో తేటతెల్లమైంది. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్, నవరత్నాల అమలు, విభజన సమస్యల [more]

ఆత్మ విమర్శ ఎక్కడా? పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న గోరంట్ల

15/06/2019,07:47 ఉద.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలోకూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు గొప్పేమి కాదని ఆయనతో రామారావు బతికున్నంతకాలం పోరాడి మంత్రి పదవిని సైతం త్యాగం చేసి విలువలకు కట్టుబడిన పసుపు నాయకుడు. ఎన్టీఆర్ మరణానంతరం [more]

పార్టీ వెలుగు కోసం ప్రశాంత్ కిషోర్ వేటలో బాబు ?

15/06/2019,07:31 ఉద.

ఆయన అపరచాణుక్యుడు, ప్రపంచ మేధావి, ఐటి ఆరాధ్యుడు ఇలా టిడిపి అనుకూల పత్రికలు తెలుగుదేశం అధినేతకు అవసరానికి మించి మరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేవి. అవన్నీ నిజమని భావించిన చంద్రబాబు ఎన్నికల వ్యూహాల పై వ్యూహాలు రచించి అవన్నీ ఫెయిల్ అయి చివరికి ఘోరపరాజయాన్ని తద్వారా పరాభవాన్ని [more]

షా….నెంబర్ 2…ఎలా అయ్యారు…??

14/06/2019,10:00 సా.

అమిత్ అనిల్ చంద్ర షా.. ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన నేత అయిన అమిత్ షా పూర్తి పేరు అనల్ అమిత్ చంద్ర షా. అయిదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ [more]

పిడుగులాంటి మాట…

14/06/2019,10:00 సా.

రాజకీయాల్లో మంచి చేసేందుకైనా, చెడు చేసేందుకైనా దమ్ముండాలి. అందులోనూ అందివచ్చే అవకాశాన్ని వదులుకోవాలంటే ఉదారత, త్యాగబుద్ధి కూడా అవసరమే. పచ్చి అవకాశవాదం రాజ్యం చేస్తున్న రోజుల్లో నీతిమంతంగా ఉంటానని చెప్పడమంటే ఒక సాహసమే. అలా చెబుతున్నారంటే సంతృప్త స్థాయికి చేరుకుని అయినా ఉండాలి. లేకపోతే ఉన్నది చాలు. కొత్త [more]

నో ఫస్ట్ యూజ్…

14/06/2019,09:00 సా.

అణ్వస్త్రాలు కలిగిన దేశాలు ఒక అవగాహనకు వస్తుంటాయి. తమ దేశం మొదటిగా శత్రు దేశంపై అణు ఆయుధాలు ప్రయోగించదని చెబుతుంటాయి. దీనివల్ల తమ ఉదారతను చాటు కోవడమే కాదు, తమ దేశ రక్షణకు సంబంధించి జాగ్రత్త తీసుకున్నట్లుగా కూడా చూడాలి. ఎందుకంటే ఒకసారి అణ్వాయుధాలు వాడితే అంతర్జాతీయ సమాజం [more]

బాబు డిమాండ్ కి నైతికత ఉందా ?

14/06/2019,08:20 ఉద.

చంద్రబాబునాయుడుని రాజకీయ చతురుడు అంటారు. తిమ్మిని బమ్మిని చేయడం ఆయనకే సాధ్యం. అనుకూలతలన్నీ తనవైపు ఉంచుకుని ప్రతికూలతలు ఇతరుల మీదకు నెట్టడంతోనూ బాబు దిట్ట. ఇక తాను చెప్పిన మాటకు కట్టుబడిఉండకపోవడమే కాదు, దానికి సైతం తనకు వీలుగా మార్చుకునే నేర్పు కూడా బాబుదే. అప్పట్లో ఎనిమిదిన్నరేళ్ళు, ఇపుడు [more]

1 2 3 186