స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

షా….నెంబర్ 2…ఎలా అయ్యారు…??

14/06/2019,10:00 సా.

అమిత్ అనిల్ చంద్ర షా.. ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన నేత అయిన అమిత్ షా పూర్తి పేరు అనల్ అమిత్ చంద్ర షా. అయిదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ [more]

పిడుగులాంటి మాట…

14/06/2019,10:00 సా.

రాజకీయాల్లో మంచి చేసేందుకైనా, చెడు చేసేందుకైనా దమ్ముండాలి. అందులోనూ అందివచ్చే అవకాశాన్ని వదులుకోవాలంటే ఉదారత, త్యాగబుద్ధి కూడా అవసరమే. పచ్చి అవకాశవాదం రాజ్యం చేస్తున్న రోజుల్లో నీతిమంతంగా ఉంటానని చెప్పడమంటే ఒక సాహసమే. అలా చెబుతున్నారంటే సంతృప్త స్థాయికి చేరుకుని అయినా ఉండాలి. లేకపోతే ఉన్నది చాలు. కొత్త [more]

నో ఫస్ట్ యూజ్…

14/06/2019,09:00 సా.

అణ్వస్త్రాలు కలిగిన దేశాలు ఒక అవగాహనకు వస్తుంటాయి. తమ దేశం మొదటిగా శత్రు దేశంపై అణు ఆయుధాలు ప్రయోగించదని చెబుతుంటాయి. దీనివల్ల తమ ఉదారతను చాటు కోవడమే కాదు, తమ దేశ రక్షణకు సంబంధించి జాగ్రత్త తీసుకున్నట్లుగా కూడా చూడాలి. ఎందుకంటే ఒకసారి అణ్వాయుధాలు వాడితే అంతర్జాతీయ సమాజం [more]

బాబు డిమాండ్ కి నైతికత ఉందా ?

14/06/2019,08:20 ఉద.

చంద్రబాబునాయుడుని రాజకీయ చతురుడు అంటారు. తిమ్మిని బమ్మిని చేయడం ఆయనకే సాధ్యం. అనుకూలతలన్నీ తనవైపు ఉంచుకుని ప్రతికూలతలు ఇతరుల మీదకు నెట్టడంతోనూ బాబు దిట్ట. ఇక తాను చెప్పిన మాటకు కట్టుబడిఉండకపోవడమే కాదు, దానికి సైతం తనకు వీలుగా మార్చుకునే నేర్పు కూడా బాబుదే. అప్పట్లో ఎనిమిదిన్నరేళ్ళు, ఇపుడు [more]

అంతా ఆ స్కూల్ లో జాయిన్ అయిపోతారా ..?

14/06/2019,07:59 ఉద.

తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయో లేదో కారు, కమలం జోరు మీద ఉండగా హస్తం, సైకిళ్ళు వారి దెబ్బకు బేజారు అయిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన శాసన సభ్యుల్లో 12 మందిని గులాబీ పార్టీ కలిపేసుకుని సీఎల్పీ లేకుండా చేసింది. ఇక ఆ షాక్ నుంచి ఇంకా [more]

అక్కడ వ్యూహం మార్చారు…!!!

13/06/2019,10:00 సా.

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాశ్మీర్ పై కన్నేసింది. ఈ శీతల సంపద రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కాశ్మీర్ లో నడుస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ కీలక ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ [more]

ఫ్యాన్ గాలి తెలిసి ఏడాది పూర్తి అయ్యింది

13/06/2019,10:56 ఉద.

ఉభయగోదావరి జిల్లాలు వైసిపి వైపే ఉన్నాయని చాటి చెప్పింది ఆ చారిత్రక సంఘటన. ఏడాది క్రితం అధికార తెలుగుదేశం పార్టీకి ఆ దృశ్యం ప్రమాద ఘంటికలు మారుమ్రోగించిన అర్ధం కాలేదు. అదే వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల్లోని చారిత్రక రోడ్ కం రైలు [more]

ఆయన ఫ్యూచర్ ఆయనే చెప్పుకోవాలి….!!!

13/06/2019,06:00 ఉద.

స‌బ్బం హ‌రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ‌యాంలో అనాక‌ప‌ల్లి ఎంపీగా వ్యవ‌హ‌రించిన కాంగ్రెస్ నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న‌తో తెర‌మీదికి వ‌చ్చిన ఆయ‌న విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా గ‌ళం వినిపించాడు. విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా ఆయ‌న త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయిన‌ప్పటికీ.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ పార్టీలోనూ [more]

చెప్పాలంటే ఎంతో ఉంది…??

12/06/2019,11:00 సా.

నవీన్ పట్నాయక్… సమకాలీన రాజకీయాల్లో శిఖర సమానుడు. నీతి, నిజాయితి, నిరాడంబరతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజారంజక పాలనకు పెరెన్నికగన్న నాయకుడు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు. అన్నింటికి మించి తన పరిమితులు ఏమిటో తనకు బాగా తెలిసిన నాయకుడు. అయిదు సార్లు ముఖ్యమంత్రి అయినా అధికార గర్వం తలకు [more]

చరిత్ర తిరగరాస్తేనే మంచిదా…??

12/06/2019,10:00 సా.

దేవాలయాల ధర్మకర్తల మండలి పేరు చెబితే చాలు రాజకీయ వాసనలు గుప్పుమంటాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కీలకమైన దేవస్థానాల పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. ఛైర్మన్, ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమితులైతే సంఘంలో హోదా, ప్రత్యేక గుర్తింపు, పలుకుబడి లభిస్తాయి. అందుకే అధికారంలో ఉన్న పార్టీల [more]

1 3 4 5 6 7 189