స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

మోడీ, రాహుల్ కు ఈ తలనొప్పులేంటి?

21/11/2017,11:00 సా.

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం కన్నా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సమస్యలను అధిగమించడం గుజరాత్ బీజేపీ, కాంగ్రెస్ లకు కత్తిమీద సాములా మారింది. టిక్కెట్ల కేటాయింపు ఇరు పార్టీలకు సరికొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఎన్నికల్లో విజయాన్ని కాసేపు పక్కన పెడితే ముందు ఈ అసమ్మతి [more]

ఇందిరకు ఇంత అవమానమా?

21/11/2017,10:00 సా.

ఆమె ఆది పరాశక్తి. దుర్గామాత… 1971లో పాకిస్థాన్ కబంధ హస్తాల నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానిిక కృషి చేసిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై వెల్లువెత్తిన ప్రశంస ఇదీ. ఈ అభినందనలు కాంగ్రెస్ భజన బృందానివి కావు. పార్టీ అభిమానులవి కానే [more]

ఈవెంట్ పోయె…ఈసడింపులే మిగిలె..!

21/11/2017,09:00 సా.

సినీ తారల తళుకుబెళుకులతో భూనబోంతరాలు దద్దరిల్లేలా భారీ ఈవెంట్ నిర్వహిద్దామనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రయత్నం వికటించింది. మొదటికే మోసం వచ్చింది. అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ తలపై మరో పదికోట్ల రూపాయల భారం పెట్టి బ్రహ్మండంగా చేద్దామనుకున్న నంది అవార్డుల ప్రదానోత్సవం పక్కదారి పట్టింది. ఎంపికే వెటకారాలకు దారితీసింది. పైకి [more]

కాంగ్రెసు లో కొత్త శకం…!

20/11/2017,10:00 సా.

ఆధునిక రాజకీయాల్లోనూ ఆనాటి రాచరికపు ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా అణచివేయడమే కాకుండా భవిష్యత్తులో పోటీగామారతారని భావించిన వాళ్లను సైతం మొగ్గలోనే తుంచేయడం మనకు చరిత్ర నేర్పిన పాఠం. కాంగ్రెసు పార్టీ యువరాజు రాహుల్ గాంధీ పార్టీ అధినేతగా పట్టాభిషిక్తుడు కావడానికి సర్వం సిద్ధమైన తరుణంలో [more]

రాజా…ది గ్రేట్…!

18/11/2017,11:59 సా.

సౌదీ అరేబియా…. అరబ్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం. అత్యంత సంప్రదాయ దేశం కూడా. మతాచారాలు, పద్ధతులు, సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటించే దేశం. మహిళలపై అనేక ఆంక్షలనున అమలు చేస్తోంది. ఒకరకంగా వివక్ష ప్రదర్శిస్తోందని కూడా చెప్పొచ్చు. అటువంటి ఈ పశ్చిమాసియా దేశం ఇప్పుడు సంస్కరణల బాటలో [more]

ఇవాంకా… కసితో కోట్లకు పడగలెత్తారు…!

18/11/2017,10:00 సా.

ఇవాంకా ట్రంప్…. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు బహు అరుదు అంటే అతిశయోక్తి కాదు. ఆమె అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు కూతురు. ఆయన సలహాదారు కూడా. ప్రముఖ వ్యాపార వేత్త, మోడలింగ్, యాంకరింగ్… ఇలా ఆమె ప్రతిభ బహుముఖం. గత ఏడాది తండ్రి తరుపున ఎన్నికల ప్రచారం [more]

రాజధాని రాజకీయాలకు చెంపపెట్టు

18/11/2017,09:00 సా.

ఆశగా ఎదురుచూస్తున్నఅమరావతి రాజధాని నిర్మాణానికి ముందడుగు పడింది. ప్రాంతం ఎంపిక మొదలు రాజకీయ వివాదాలు,విభేదాలతో రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన చికాకులను ఎదుర్కొంటోంది. విపక్షం కావచ్చు. లేదా కొందరు పర్యావరణ ఆసక్తి కలిగిన వ్యక్తులు కావచ్చు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు గడచిన రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు గ్రీన్ [more]

నేను…నా పార్టీ …దట్సాల్

16/11/2017,09:00 సా.

మొహమాటం లేదు. మాట్లాడితే ముక్కుమీద గుద్దినట్టే. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ నియమించే రైతు సమన్వయ సమితుల్లో పార్టీ కార్యకర్తలనే నియమిస్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మా వాళ్లు అర్హులు. వాళ్లనే అందలం ఎక్కిస్తామంటూ తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఎంతోకొంత బెదిరిస్తే అందరికీ చోటుంటుంది అని [more]

ఆసియాన్ లో భారత్ దే పైచేయి…!

15/11/2017,11:59 సా.

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రెండు రోజుల పాటు జరిగిన ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) సదస్సుకు అనన్య ప్రాధాన్యం ఉంది. ఇది స్వర్ణోత్సవ సదస్సు కావడమే ఇందుకు కారణం. 1967 ఆగస్టు 8న ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాస్ నేషన్స్) ఆవిర్భవించింది. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, [more]

బీజేపీ ఛాన్స్ మిస్సవుతుందా?

14/11/2017,09:00 సా.

ప్రతిపక్షం లేకపోవడంతో నాయకుడు లేని సినిమాలా మారింది అసెంబ్లీ పరిస్థితి అంటూ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు బీజేపీ శాసనసభాపక్షం నేత విష్ణుకుమార్ రాజు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పార్టీగా నిలదొక్కుకునేందుకు భారతీయ జనతాపార్టీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో [more]

1 56 57 58 59 60 69