స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

చిక్కడు..దొరకడు…!

24/05/2018,09:00 సా.

కేసీఆర్ తీరే వేరు. మాటే కాదు, మనసు కూడా వైవిధ్యం. ఎవరికీ అంతుచిక్కడు. పట్టుదొరకడు.వామపక్షాల సహా అంతా అలసిపోయి ఎవరి కుంపటి వారు నడుపుకుంటున్న స్థితిలో కొత్త ఆలోచన రేకెత్తించారాయన. సెక్యులర్, ఫెడరల్,థర్డ్ ..పేరు ఏదైనా ఒక కూటమి పెట్టాలంటూ మూడునెలల క్రితం ముచ్చట మొదలు పెట్టారు. బీజేపీ, [more]

‘‘కుమార’’ కు అన్ని వైపుల నుంచి కుమ్ముడే…!

22/05/2018,10:00 సా.

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి(58) ఎంతో అదృష్టవంతుడు. మొత్తం రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి, అహోరాత్రులు శ్రమించిన నాయకులు ముఖ్యమంత్రులు కావడం కష్టమవుతున్న రోజుల్లో ఆయన ఆ పదవిని సునాయసంగా అందుకోగలుగుతున్నారు. పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ, పరిమితమైన శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పరిస్థితుల [more]

‘‘అనాథ’’ రక్షకుడితో ఆటలా…?

22/05/2018,09:00 సా.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా కొలువులందుకునే వెంకన్న చుట్టూ కోటరీ రాజకీయాలు మొదలయ్యాయి. ఆయనపట్ల అచంచల భక్తివిశ్వాసాలు తమకే ఉన్నాయంటూ చాటిచెప్పుకునేందుకు పొలిటికల్ పార్టీలు తంటాలు పడుతున్నాయి. మధ్యలో అర్చకరాజకీయాలూ మంటలు పుట్టిస్తున్నాయి. మొత్తమ్మీద వెంకన్నకు గోవింద నామాలు పెట్టే విషయంలో పోటాపోటీ తలపడుతున్నారు. ఈ క్రమంలో భక్తుల మనోభావాలు, [more]

న్యాయానికి నిలువెత్తు రూపం…!

21/05/2018,11:59 సా.

సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ పెద్దగా ఆసక్తి కలిగించవు. సంచలనాలు అసలే కలగించవు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వారి వృత్తి వ్యాపకాలు ప్రజా జీవితంలో ముడిపడి ఉండవు. జన జీవితంలో ఉండరు. కాని పదునైన తీర్పులు ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలను పొందుతారు. వారి ఆదరాభిమానాలకు పాత్రులు [more]

రాహుల్ ఓడారా? గెలిచారా?

21/05/2018,10:00 సా.

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మొన్నటి ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిందా? లేక పరాజయం పాలైందా. ఈ నెల 15న వెల్లడైన ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇలాంటి అనుమానాలు, సందేహాలు సగటు ఓటరుకు కలగక మానవు. వందేళ్లకు పైగా చరిత్ర గల పార్టీ ఓడిపోయిందని ఒక [more]

కర్ణాటక క్వశ్చన్ మార్కులు…!

21/05/2018,09:00 సా.

కర్ణాటకం దేశ రాజకీయ యవనికపై అనేక ప్రశ్నలు రేకెత్తించింది. కొన్ని సందేహాలకు సమాధానాలు వెదికిపెట్టింది. మరికొన్ని అనుమానాలకు బీజం వేసింది. సందిగ్ధత,అనిశ్చితి జోడుగుర్రాలపై నడుస్తున్న రాజకీయాల్లో రేపేం జరుగుతుందో చెప్పలేని అయోమయం అంతర్నాటకంగా సాగిపోతూనే ఉంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలు, ప్రజాస్వామ్యానికి ప్రతిక్షణం కావలి కాసుకోవాల్సిన ఘట్టాలు అనేకం [more]

బాబుకు అసలు విలన్ ఆయనే..!

21/05/2018,08:00 సా.

చంద్రబాబు నాయుడికి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటారు. కానీ ప్రజాక్షేత్రంలో మరో ప్రధాన ప్రత్యర్థి ఆయనను బెంబేలెత్తిస్తున్నారు. తన విధానాలు,చర్యలతో కలవరం కలిగిస్తున్నారు. ఆయనెవరో కాదు. ఒకనాటి సహచరుడు, ప్రస్తుతం తెలంగాణ కౌంటర్ పార్ట్ కేసీఆర్. అమరావతికి వెళ్లి పోయినా చంద్రబాబు [more]

ద విన్నర్ ఈజ్…. ….స్పిరిట్ ఆఫ్ డెమొక్రసీ

19/05/2018,09:00 సా.

ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లింది. కన్నడ నాట కథ ప్రతిపక్షాలకు కొత్త దారి చూపింది. ప్రజాతీర్పుతో నిమిత్తం లేకుండానే దున్నేయాలనుకున్న బీజేపీకి గుణపాఠం నేర్పింది. దేశంలోనే అత్యంతశక్తిమంతమైన నాయకునిగా అవతరించిన మోడీకి వ్యతిరేకంగా అన్నిశక్తులూ ఏకమై దూకుడును అడ్డుకున్న ఘట్టం అపూర్వంగా నిలిచింది. 2019 ఎన్నికలకు బీజేపీని నిరోధించే వ్యూహాలకు [more]

జనారణ్యంలోకి అజ్ఞాతవాసి…!

18/05/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీతో విడిపోయిన తర్వాత జనసేన ఎదుర్కొంటున్న పలు ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు వెదికే పనిలో పడ్డారు. ఈనెల 20 వ తేదీ నుంచి మొదలు పెట్టనున్న ప్రజాపోరాట యాత్ర ఈదిశలో ఏరకమైన సంకేతాలు అందిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. జనసేనకు సంబంధించి ఇది తొలి క్రియాశీల రాజకీయ [more]

న్యాయం నిలిచింది…!

18/05/2018,08:00 సా.

కన్నడ బల పరీక్షలో ఎవరైనా నెగ్గవచ్చు. ఏ పార్టీ అయినా అధికారం చెలాయించవచ్చు. ప్రత్యర్థి అక్రమాలకు పాల్పడి పగ్గాలు దక్కించుకుందని ఆరోపించవచ్చు. రాజకీయ పార్టీలకు ఇది సహజం. సామదానభేదదండోపాయాలతో అధికారమే పరమావధిగా భావించే పార్టీలు తప్పులు, అక్రమాలకు పాల్పడటం కొత్తేమీ కాదు. ఒకనాటి కాంగ్రెసు నుంచి నేటి బీజేపీ [more]

1 57 58 59 60 61 102