టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ఎవరినీ వదిలిపెట్టను… వడ్డీతో సహా ఇస్తా

25/02/2020,05:14 సా.

ఎవరినీ వదలిపెట్టనని, వడ్డీతో సహా చెల్లిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై తాను అధికారంలో ఉండగా ఇలాగే చేసి ఉంటే పార్టీ ఉండేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం [more]

అమెరికాలో ప్రమాదం… ముగ్గురు మృతి

25/02/2020,04:44 సా.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీయులు మృతి చెందారు. మృతులు రాజా, ప్రేమ్ నాధ్, దివ్యగా గుర్తించారు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళుతుండగా కారు ప్రమాదంలో ముగ్గురూ మృతి చెందినట్లు సమాచారం. దివ్య, రాజాలు హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు. ప్రమాద సమయంలో దివ్య కారును డ్రైవ్ చేస్తున్నట్లు [more]

ఐదు ఒప్పందాలు చేసుకున్నాం

25/02/2020,01:59 సా.

రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై కలసి పోరాడాలని నిర్ణయించామన్నారు. సహజ వాయు రంగంలో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. ఇస్లాం తీవ్రవాదాన్ని అణిచి వేస్తామని చెప్పారు. టూర్ తాను ఎప్పటికీ మరచి పోలేనని చెప్పారు. ఇండియాతో ప్రత్యేక అనుబంధం [more]

అమిత్ షా అత్యవసర సమావేశం

25/02/2020,12:58 సా.

ఢిల్లీలో జరిగిన అలర్ల నేపథ్యంలో కేంద్ర హోంమత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్య ఢిల్లీలో నిన్న అల్లర్లు చెలరేగి పెద్దయెత్తున ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈశాన్య ఢిల్లీలో 144వ సెక్షన్ విధించారు. అయినా అల్లర్లు ఆగడం లేదు. నిన్నటి జరిగిన ఘటనలో [more]

జాస్తి కి క్యాట్ లో ఊరట

25/02/2020,11:52 ఉద.

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కు క్యాట్ లో ఊరట లభించింది. క్యాట్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు ఆయన వెళ్లేందుకు అనుమతించింది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జాస్తి కృష్ణ కిషోర్ ను ఇటీవల ఏపీ [more]

మార్చి 3న ఉరి అనుమానమే

25/02/2020,11:46 ఉద.

నిర్భయ నిందితులకు మార్చి 3వ తేదీన ఉరి శిక్ష అమలు పర్చడం అనుమానంగానే కనిపిస్తుంది. నలుగురు నిందితులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్ర హోంశాఖ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి నలుగురు నిందితులకు మార్చి 3వ తేదీన ఉరి తీయాల్సి [more]

బ్రేకింగ్ : ఆ ఎన్నికకు షెడ్యూల్

25/02/2020,10:42 ఉద.

రాజ్యసభ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. దేశ వ్యాప్తంగా మొత్తం 55 స్థానాలకు గాను రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 26వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండింటికి [more]

కాంగ్రెస్ సంచలన నిర్ణయం

25/02/2020,09:23 ఉద.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విందు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఇచ్చే విందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ [more]

ట్రంప్ రెండో రోజు ఒప్పందాలపై?

25/02/2020,09:09 ఉద.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో రెండో రోజు పర్యటన చేస్తున్నారు. ఈరోజు రెండు దేశాల మధ్య వివిధ ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే రెండు రకాల హెలికాప్టర్ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నేవీకి రోమియో, ఆర్మీకి అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరగనుంది. హైదరాబాద్ హౌస్ [more]

నన్నే టార్గెట్ చేశారు

25/02/2020,08:50 ఉద.

తనపై టీడీపీ నేతలు కావాలని దాడులు చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనను కాలర్ పట్టుకోవడమే కాకుండా రైతుల ముసుగులో కొందరు టీడీపీ [more]

1 2 3 1,616