టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ఆయనకు కూడా నాన్‌బెయిలబుల్ వారెంట్….!

09/04/2016,06:35 సా.

బ్యాంకులను నిండా ముంచేసిన విజయ్‌మాల్యా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తమ ముందు హాజరు కావాంటూ ఈడీ ఇచ్చిన సమన్లకు మూడోసారి కూడా మాల్యా డుమ్మా కొట్టారు. సమన్లను మాల్యా అసలు పట్టించుకోకపోవడంతో ఈడీ సీరియస్‌గా ఉంది. మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఆయన [more]

చాగంటి ని ఎపి సలహాదారుగా నియమించిన చంద్రబాబు!

08/04/2016,08:52 ఉద.

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్‌ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చాగంటిని సీఎం సత్కరించారు. ఈ [more]

ముహూర్తం కుదిరింది!

08/04/2016,08:40 ఉద.

గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు నేతలు నేడు టీడీపీలో చేరనున్నారు. ఉగాది పర్వదినాన్ని శుభసూచకంగా భావించిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్… నేడు విజయవాడలో టీడీపీ అధినేత, [more]

అంగరంగ వైభవంగా రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు !

08/04/2016,08:38 ఉద.

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి తొలుత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. వచ్చిన వారిని గవర్నర్‌ దంపతులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ఆయన సతీమణి తో [more]

కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీచేసిన కోర్టు!

08/04/2016,08:33 ఉద.

కేంద్ర మంత్రి సృజన చౌదరి మారిషస్ బ్యాంకు కు 106 కోట్లు అప్పు ఎగ వేసిన కారణంగా మారిషస్ బ్యాంకు కోర్ట్ ని ఆశ్రయించింది. విచారణకు హాజరు కావాలని కోర్టు 3 సార్లు సామాన్లు పంపింది. కాని సుజన చౌదరి కోర్టు కి హాజరు కాలేదు. విచారణకు హాజరు [more]

భవిష్యత్తు లో లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు: పల్లె

07/04/2016,08:25 ఉద.

రాష్ట్ర మంత్రివర్గంలోకి నారా లోకేశ్‌ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి చేపట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు లోకేశ్‌కు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో లోకేశ్‌ ముఖ్యమంత్రి కూడా అవుతారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి రికార్డుస్థాయిలో 54లక్షల [more]

నగరాన్ని అభివృద్ధి చెయ్యడానికి ప్రజలు సహకరించాలి: మేయర్

07/04/2016,08:23 ఉద.

బల్దియాలో ఆస్తిపన్ను వసూళ్లే ప్రధాన ఆదాయ వనరని హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. పన్ను వసూలులో సిబ్బంది చురుగ్గా ఉన్నారని కితాబిచ్చారు. ఎర్లీబర్డ్‌ పథకంలో భాగంగా ముందే పన్నులు చెల్లించి ప్రజలు నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉగాది తర్వాత 100 రోజుల పథకం అమలు [more]

అంతర్జాతీయ ఇంధన సదస్సు విజయవాడలో ప్రారంభం!

07/04/2016,08:20 ఉద.

విద్యుత్ పొదుపుతో దేశంలో 40 వేల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని ఎపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇంధన సదస్సు గురువారం విజయవాడలో ప్రారంభమైంది. అమెరికా, బ్రిటన్ సహా 35 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో తొలిసారి [more]

డిశ్చార్జ్ అయిన వెంట‌నే అరెస్టు!

07/04/2016,08:15 ఉద.

బుల్లి తెర న‌టి ప్ర‌త్యూష ఆత్య‌హ‌త్య ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య వెనుక ఆమె ప్రియుడు రాహుల్ ఉన్నాడ‌ని ప్ర‌త్యూష కుటుంబ సభ్యులు, స్నేహితులు, స‌న్నిహితులూ ఆరోపిస్తున్నారు. రాహుల్‌కి వ్య‌తిరేకంగా పోలీసులు వాంగ్మూలాలు సేక‌రించే ప‌నిలో పడ్డారు. దాదాపు 20మందిని విచారించిన పోలీసులు.. ఈ ఆత్మ‌హ‌త్య వెనుక [more]

సారీ చెప్పను కానీ నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా: రోజా

07/04/2016,08:09 ఉద.

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు దిగి వచ్చారు. సహచర మహిళా ఎమ్మెల్యే అనితపై నోరు పారేసుకుని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన ఆర్ కె రోజా బుధవారం శాసనసభ ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరయ్యారు. కమిటీ ముందు రోజా వివరణ ఇచ్చారు. అనితపై తనకెలాంటి [more]

1 1,108 1,109 1,110 1,111 1,112 1,119