టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ఆ విధముగా హోదా బిల్లుకు మంగళం పాడడమైనది!

18/11/2016,05:08 సా.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం అనేది చాలా కష్టసాధ్యమైన సంగతి. అయితే.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన  మాటను, అదే పార్లమెంటు సాక్షిగానే తేలిపోయినట్లు చాటి చెప్పాలనే ఉద్దేశంతో అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేటు మెంబరు బిల్లు, మనీ [more]

రోజుకో చర్య తీసుకుంటున్న చంద్రబాబు!

18/11/2016,03:57 సా.

ప్రజలకు ఎదురవుతున్న నోటు కష్టాలను దూరం చేయడం, వీలైనంత త్వరగా రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీల విషయంలో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం అనే దిశగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నోట్ల మార్పిడి గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏపీలో ఎక్కువగా [more]

ప్రపంచబ్యాంకు నిధులతో అమరావతి కి శ్రీకారం

18/11/2016,01:25 సా.

2018 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం తొలివిడత పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఆర్డీఏ కమిషనర్ చెబుతున్న వివరాలు, నిపుణుల అంచనాలను పోల్చి చూసుకున్నా సరే.. 2018 సంవత్సరాంతానికి మౌలిక వసతుల కల్పన విషయంలో ఒక నిర్దిష్టమైన రూపం వస్తుందని, కోర్ కేపిటల్ మరియు కొన్ని భవనాల [more]

కింజరాపు గళం : వట్టిమాటలు కట్టి పెట్టాల్సిందే!

18/11/2016,12:22 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో.. ఏ హామీలనైతే ఇచ్చారో వాటన్నింటినీ పేపర్ మీద పెట్టాల్సిందేనని, వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందేనని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. శుక్రవారం నాడు లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన [more]

విజృంభిస్తున్న ముఠాలు : నల్లడబ్బే కదా.. దోచేద్దాం!

18/11/2016,11:15 ఉద.

దొంగతనమో దోపిడీనో జరిగితే వెళ్లి పోలీసులకు మొరపెట్టుకుంటాం. మన వద్ద ఉన్నదే దొంగడబ్బు అయితే.. ఇక చేసేదేముంటుంది! తేలుకుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా ఊరకుండిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితినే నేరపూరిత ఆలోచనలు ఉండే పలువురు ఈ సమయంలో సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్ద నల్లడబ్బు భారీ నిల్వలు ఉండి, దాన్ని [more]

రేవంత్ రెడ్డి.. మరో నిరుపయోగ ప్రయత్నం

18/11/2016,09:59 ఉద.

తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద పోరాటం సాగించడంలో అలుపెరగకుండా కష్టపడుతున్న వారిలో ఒకరైన తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ కోసం తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో విపక్షాల్లోని ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అధికార పార్టీ లో [more]

ఓటుకునోటు కేసులో ఎంట్రీ ఇచ్చిన ఉండవిల్లి!

18/11/2016,05:16 ఉద.

తెలంగాణలో ఏసీబీ విచారణ సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం , వివాదం, దానికి సంబంధించిన కేసుల విచారణ నుంచి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కు అప్పుడే విముక్తి లభించేలా కనిపించడం లేదు. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్మినిస్ట్రేషన్ ను మొత్తం [more]

బీజేపీ అంటే భారతీయ జనతా పరేషన్

17/11/2016,08:06 సా.

నోట్ల రద్దు, నల్ల ధనం నియంత్రణకు మోడీ సర్కార్ తీసుకున్న చర్యల వలన, కొన్ని రోజుల పాటు జనానికి తప్పవు అనుకున్న కష్టాలన్నీ ఇంకా ఒక కొలిక్కి రాకముందే, పార్లమెంట్ సమావేశాలు మొదలు కావడం విపక్షాలకు బాగా కలిసొచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు భయంకరంగా వేడెక్కాయి. విపక్షాలన్నీ మూకుమ్మడి [more]

ఆ విషయంలో దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్!

17/11/2016,06:59 సా.

మన దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కొక్క  కోణంలోంచి చూస్తే ముఖ్యమంత్రులకు ర్యాంకులు రకరకాలుగా దక్కవచ్చు. ఆయా కోణాల్లో సీఎం ల మధ్య పోటీ కూడా ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ఒక విషయంలో చంద్రబాబునాయుడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరీలోకీ నెంబర్ వన్ అనిపించుకుంటున్నారు. ఆ విషయంలో.. [more]

మోదీ రమ్మన్నారు : రేపు ఢిల్లీకి కేసీఆర్!

17/11/2016,06:45 సా.

నోట్ల రద్దు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న కష్టాలను కేంద్రం దృఫ్టికి తీసుకు వెళ్లడానికి, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. రాబడి పరంగా తెలంగాణ సర్కారుకు ఎంత నష్టం వాటిల్లిందో వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాయించిన కేసీఆర్ గురువారం ఏకంగా ప్రధానికి మోదీకి [more]

1 1,336 1,337 1,338 1,339 1,340 1,398