టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

జగన్ బాబును పిలవరా…?

25/05/2019,09:37 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీని జగన్ రేపు ఆహ్వానించనున్నారు. అలాగే పొరుగురాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. కానీ జగన్ ప్రస్తుతమున్న తాడేపల్లికి సమీపంలో ఉండవల్లిలోనే ఉన్న [more]

మోదీ వద్దకు జగన్…!!

25/05/2019,09:11 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న తన ప్రమాణస్వీకారోత్సవానికి మోదీని జగన్ ఆహ్వానించనున్నారు. రేపు వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడ మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఈ నెల 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్న [more]

కేసీఆర్ చెంతకు జగన్…?

25/05/2019,08:13 ఉద.

ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలవనున్నారు. జగన్ ఈరోజు సాయంత్రం నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి ఈ నెల 30వతేదీన జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. తొలుత [more]

కష్టాన్ని గుర్తించలేదా….?

25/05/2019,08:05 ఉద.

నిన్నటి వరకూ నలభై ఏళ్ల అనుభవమున్న రాజకీయ నేత అని ఉప్పొంగిపోయిన నారా చంద్రబాబునాయుడు ఫలితాలను చూసి డీలా పడ్టారు. ఓటమి పై విశ్లేషణ చేసేందుకు కూడా ఎలాంటి కారణాలు దొరకలేదు. హేమాహేమీలు సయితం ఓటమి పాలయ్యారు. గట్టి అభ్యర్థులనుకున్న వారంతా వరసబెట్టి పరాజయం బాట పట్టారు. ఫలితాల [more]

నన్ను క్షమించండి… ఇక సర్వేలు చేయను..!

24/05/2019,05:36 సా.

రాజకీయాలకు సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి సర్వేలకూ సన్యాసం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ దెబ్బకు లగడపాటి చెప్పిన లెక్కలు చిత్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పగా సీన్ రివర్స్ అయ్యి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో లగడపాటి రాజగోపల్ [more]

వైఎస్సార్సీఎల్పీ నేతగా ఎన్నికవనున్న జగన్

24/05/2019,04:54 సా.

ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం రేపు జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయంలో ఉదయం 10.31 గంటలకు వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభా పక్ష నేతగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు. [more]

జగన్ గెలుపుతో ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరింది

24/05/2019,01:51 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంబరాల్లో మునిగిపోయారు. ఇవాళ ఆయన అనుచరులతో కలిసి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులర్పించారు. ఆయన అనుచరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాణాసంచా [more]

జగన్ ఒక పెదరాయుడు

24/05/2019,01:50 సా.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గొప్ప ప్రజా నాయకుడని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు పేర్కొన్నారు. వైసీపీ విజయంపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో జగన్ కు కూడా ప్రజలు అలానే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన [more]

చంద్రబాబు ఫోటోలు, మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగింపు

24/05/2019,01:13 సా.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడనున్నందున సచివాలయంలో మాజీ మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలను సైతం తొలగించారు. సాధారణ పరిపాలన శాఖా ఆదేశాల మేరకు మంత్రుల పేషీల్లో వారి నేమ్ ప్లేట్లను తొలగిస్తున్నారు.

పని ప్రారంభించిన కాబోయే సీఎం జగన్

24/05/2019,12:48 సా.

ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పుడే పరిపాలనపై కసరత్తు ప్రారంభించారు. నిన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయనను ఇవాళ వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కలిశారు. వారి శాఖల గురించి ఆయన వారితో చర్చిస్తున్నారు. ప్రమాణస్వీకారం చేశాక తీసుకోవాల్సిన [more]

1 2 3 4 1,353