టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియూ జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ఈయన దేశదిమ్మరి…. ఆయన ఆంబోతు….!!

11/11/2018,12:35 సా.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు పై ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో దేశ దిమ్మరిగా తిరుగుతున్నారన్నారు. ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన సొమ్మును తన రాజకీయ స్వప్రయోజనాలకోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఎవరిని [more]

విజయమ్మ వ్యాఖ్యలకు కౌంటర్.!!

11/11/2018,12:24 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తి దాడి అంతా నాటకమేనని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఈ కేసులో సహకరించడం లేదన్నారు. హైకోర్టు చెప్పినా స్టేట్ మెంట్ ఎందుకు ఇవ్వరని అన్నారు. పాదయాత్రకు జనం రాకపోవడం వల్లనే ఈ [more]

బ్రేకింగ్ : మంత్రులుగా ఫరూక్, కిడారి

11/11/2018,11:54 ఉద.

ఏపీ మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు. గవర్నర్ నరసింహన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాలకు చెందిన ఎన్ఎండీ ఫరూక్ చేత తొలుత గవర్నర్ ప్రమాన స్వీకారం చేయించారు. తర్వాత ఇటీవల మావోయిస్టు దాడిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ [more]

గవర్నర్ కు దూరంగా బాబు…ఎందుకంటే….?

11/11/2018,11:24 ఉద.

మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్ ను ప్రత్యేకంగా కలుసుకునేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపలేదు. విజయవాడ వచ్చిన గవర్నర్ నేరుగా గేట్ వే హోటల్ కు వెళ్లారు. సాధారణంగా గవర్నర్ వస్తే ప్రతిసారీ చంద్రబాబు గవర్నర్ తో భేటీ [more]

హత్యాయత్నం కేసులో విజయమ్మ ఏమన్నారంటే…?

11/11/2018,10:44 ఉద.

పాదయాత్రలో జగన్ పై దాడి చేయడం సాధ్యం కాదని భావించే జనం లేని విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడిచేశారని వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అన్నారు. పాదయాత్రలో దాడిచేస్తే దాడి చేసిన వ్యక్తి తప్పించుకోలేరని భావించే ఈ కుట్ర చేశారన్నారు. జగన్ పై హత్యాయత్నం జరుగుతుందని ముందే [more]

ఆ 8 రోజులు క్షణం క్షణం…?

11/11/2018,09:00 ఉద.

ఎన్నడూ ఊహించని వారంతా చిత్రంగా కలిశారు. పైకి కేసీఆర్ సర్కార్ ను ఓడించడమే వారందరి కలయికకు ఏకైక సిద్ధాంతం. కాగా తామంతా అధికారం సాధించడం ఇంకో లక్ష్యం. దీనికోసం మహాకూటమి పేరుతో తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంపైకి వచ్చాయి కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు అయితే ఇక్కడి [more]

కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఒరిగేదేం లేదు

10/11/2018,07:59 సా.

తన భార్యకు నకిరేకల్ టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కోమటిరెడ్డి బ్రదర్స్ తో కాంగ్రెస్ [more]

22న భవిష్యత్ కార్యాచరణ

10/11/2018,06:45 సా.

నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా దేశం కోసం ఇప్పుడు ఆ పార్టీతో కలుస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… నరేంద్ర మోదీ, అమిత్ షా [more]

ఏపీలో పొత్తు ఇప్పుడే కాదు…!!

10/11/2018,05:24 సా.

చంద్రబాబు, రాహుల్ గాంధీ భేటీతో మహాకూటమికి తొలి అడుగు పడిందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకుని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ చంద్రబాబు, రాహుల్ తదుపరి భేటీ గురించే మాట్లాడేందుకు తాను [more]

జాక్ పాట్ తగిలింది… ముగ్గురికి…?

10/11/2018,05:11 సా.

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముస్లింలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఒకేసారి ముస్లింలకు మూడు పదవులు కేటాయించారు. ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ షరీఫ్ ను మండలి ఛైర్మన్ గా [more]

1 2 3 4 5 1,115
UA-88807511-1