టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ఆ టిక్కెట్ ను వేలం వేసి అమ్మారు

13/11/2018,01:44 సా.

కాంగ్రెస్ పార్టీలో మొదటి విడతలో టిక్కెట్ దక్కని నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మంచిర్యాల టిక్కెట్ ఆశించిన అరవింద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల టిక్కెట్ ను వేలం వేసి అమ్మారని, ఆ వేలంలో తాను పాల్గొనలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న స్థానికేతరుడికి టిక్కెట్ ఇచ్చారన్నారు. [more]

వైసీపీ నేత అరెస్ట్… పల్నాడులో ఉద్రిక్తత

13/11/2018,01:17 సా.

పిడుగురాళ్ల మున్సిపాలిటీలో భారీగా పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురజాల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దీంతో పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపారు. మహేష్ రెడ్డితో [more]

బ్రేకింగ్: జగన్ హత్యాయత్నం ఘటనలో అవి లేవా…? హైకోర్టు ఆశ్చర్యం…!!

13/11/2018,12:36 సా.

తనపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్. పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈ కేసును విచారించిన సిట్ నివేదికను కోర్టుకు అందజేశారు. అయితే, సీపీటీవీ పుటేజ్ ను [more]

బ్రేకింగ్ : వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

13/11/2018,12:03 సా.

కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… సీనియర్ నేత అయిన [more]

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే….!!

13/11/2018,07:37 ఉద.

కాంగ్రెస్ అరవై ఐదు మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతికి టిక్కెట్లు కేటాయించారు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. 01. మంచిర్యాల – ప్రేమ సాగర్ రావు, [more]

హత్యాయత్నం కేసులో కొత్త కోణం..!

12/11/2018,08:08 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) నుంచి పలు వివరాలు కోరుతూ లేఖ రాశారు. విజయసాయిరెడ్డి ప్రశ్నలకు బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేశ్ చంద్ర [more]

వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు?

12/11/2018,07:14 సా.

తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు బహిరంగ రహస్యమేనన్నారు. కానీ వైసీపీ రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ తో 18 పార్టీలు కలసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. జగన్ [more]

అవును… రాజకీయలబ్ధి కోసమే..!

12/11/2018,06:42 సా.

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చింది రాజకీయ లబ్ధి కోసమే అని తేల్చేశారు. ప్రతీదీ రాజకీయ లబ్ధి కోసమే అని… ఇవాళ ప్రారంభించిన ఆదరణ పథకం కింద కోట్లు ఖర్చు పెట్టడం రాజకీయలబ్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. [more]

నాలుగు సీట్ల కోసం గులాంగిరీనా..?

12/11/2018,05:36 సా.

నాలుగు సీట్ల కోసం ప్రొ.కోదండరాం ఢిల్లీకి, అమరావతికి గులాంగిరి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ పలువురు టీజేఎస్ నాయకులు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కోదండరాం పాత రోజులను గుర్తు తెచ్చుకోవాలని, కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై [more]

టీడీపీ అభ్యర్థులు వీరే

12/11/2018,04:37 సా.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న స్థానాల్లో 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మహాకూటమిలో భాగంగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. మిగతా ముగ్గురు అభ్యర్థులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఖమ్మం – నామా నాగేశ్వరరావు సత్తుపల్లి – సండ్ర [more]

1 3 4 5 6 7 1,119