అక్టోబర్‌ నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి పవన్

ఉద్దానం కిడ్నీ సమస్యలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో తన వంతు బాధ్యతగా స్పందించినట్లు పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. మనుషులు చనిపోతుంటే దానిపై రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దిగజారుడుతనంగా ఉంటుందని. ఉద్దానం సమస్య పరిష్కారంలో రాజకీయ లబ్ది కోసం మాట్లాడాలి అనుకుంటే ప్రతిపక్షం మీదో., గత ప్రభుత్వాల మీదో., అధికార పార్టీ మీదో విమర్శలు చేయడం నా ఉద్దేశం కాదు. మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయడం సరికాదని., మనుషుల్ని కలిపి ఉంచే రాజకీయం చేయడమే నా ఉద్దేశమని పార్టీ పెట్టినపుడే చెప్పాను. ఈ సమస్య పరిష్కారంలో నాతో రకరకాల వ్యక్తులు కలిశారు.దీనిపై ఇప్పటికే కొంత పరిశోధన జరిగింది. ఉద్దానంలో పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. సరైన ఎదుగుదల లేదు. శరీరంలో సరైన వృద్ధి లేదు. రోగాన్ని గుర్తించి ఆస్పత్రికి వెళ్ళే నాటికి పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇదే విషయాన్ని హార్వార్డ్‌లో చెబితే వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరిశోధిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రికి కూడా చెప్పాను చిన్న పిల్లలు అనాథలవుతున్నారని., వారి బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు నాలుగేళ్లలో కేంద్ర., రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. సమస్య పరిష్కారం ఏ ఒక్కరి ఘనతో కాదు…, దీనికి సహకరించిన వారందరికి పవన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

త్వరలో క్రియాశీల రాజకీయాలు….

జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా క్రియాశీలకంగా ముందుకు రావట్లేదు. పార్టీ నిర్మాణంపై ఇంకో మూడు నాలుగు జిల్లాల్లో పరిశీలన జరుగుతోంది. తెలంగాణలో దాదాపు పూర్తైంది. ఏపీలో మూడు నాలుగు జిల్లాల్లో ఉన్నాయి. అక్టోబర్‌ నుంచి ఎక్కువగా ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్‌ నుంచి మరింత క్రియాశీలంగా పనిచేస్తాను. అక్టోబర్‌ నుంచి పూర్తి సమయం రాజకీయాల్లో ఉంటాను. చేనేత కార్మికులకు జిఎస్టీపై మాట్లాడాను. జిఎస్టీ కేంద్రం పరిధిలో ఉంది. దీనిపై సిఎంతో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి కోరాను. జిఎస్టీ కేంద్రంతో ముడిపడిన అంశం కాబట్టి దానిపై ఎలా స్పందిస్తారో చూడాలి. కేంద్రం వరకు తాను నేరుగా తీసుకెళ్లలేనని పవన్‌ చెప్పారు.

విభజన రాజకీయాలు వద్దు…..

‘గరగపర్రు దళితుల ఇష్యూ మీద నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. దానికి ప్రధాన కారణం., మా ఆశయం., లక్ష్యం సమాజాన్ని విభజించే రాజకీయాలు చేయలేను. అవి బాధ్యతారాహిత్యం అనుకుంటాను. అక్కడ కేవలం అల్లూరి బొమ్మ పెట్టి., అంబేడ్కర్‌ బొమ్మ పెట్టనివ్వకపోవడం వల్ల వచ్చిన సమస్య…. ఇది చాలా సున్నితమైన సమస్య…, గోదావరి అక్వా పార్క్‌ మీద ఎందుకు మాట్లాడలేదంటే నాతో వచ్చే వారిలో ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉంటే అది దారి తప్పుతుంది. అల్లూరి విప్లవకారుడిగా గిరిజనులతో కలిసి పనిచేశారు. ఆయన్ని కులానికి పరిమితం చేయడం తప్పు. పుస్తకాల్లో గాంధీజి ఆదర్శవంతమైన మహనీయుడిగా చెబుతారు. రాజకీయ నాయకులు మాత్రం ఆయన్ని చతురుడైన వైశ్యుడిగా అభివర్ణిస్తారు. ఇది చాలా తప్పు….. ఆధునిక ఆలోచన ధోరణి ఉన్న మేధావులు ముందుకు వస్తేనే కుల సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థానిక వ్యవస్థలు విఫలమైనపుడే ఇలాంటి సమస్యలు వస్తాయి. మొదట్లోనే వీటిని పరిష్కరిస్తే అవి జటిలమైపోతాయి. మన సమాజంలో కుల., మత., ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన నాయకుల్ని ఓ కులానికో., వర్గానికో పరిమితం చేయడం బాధాకరం. అంబేడ్కర్‌ ఏ వర్గానికో పరిమితం అయిన నాయకుడు కాదు. దీనిని అందరు అర్ధం చేసుకోవాలి. అల్లూరి క్షత్రియుడు మాత్రమే కాదు., గిరిజనులతో కలిసి పనిచేసిన వ్యక్తి…. అది అందరు అర్ధం చేసుకోవాలని పవన్‌ సూచించారు. తాను వెళ‌్ళడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనే తాను వెళ‌్ళలేదని చెప్పారు. సమాజంలో పరిస్థితుల్ని చక్కదిద్దగలిగిన నాయకులు ఇలాంటి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలి. సమాజాన్ని విభజించి పాలించే రాజకీయాలకు దూరంగా ఉండాలి., సమాజాన్ని కలిసి కట్టుగా ఉంచే రాజకీయాలు కావాలి. గోదావరి అక్వా పార్క్‌ విషయంలో సమస్య ఏమిటంటే నిబంధనలు పాటిస్తున్నారో లేదా అన్నది ప్రభుత్వం తేల్చాలి. అక్కడ నిబంధనలు పాటిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలి.’ అని పవన్ కోరారు.

కాపు రిజర్వేషన్లు…..

‘కాపు రిజర్వేషన్లలో సున్నితమైన అంశం…. సినిమాల్లో కులం అవసరం లేదు. రాజకీయాల్లో కులం సమస్య మీద అవగాహన ఉండాలి. దానిపై నేను ఎప్పుడు మాట్లాడలేదు. రాజకీయ పార్టీగా నేను మాట్లాడాల్సి ఉంది. కాపు రిజర్వేషన్లపై దశాబ్దాలుగా డిమాండ్‌ ఉన్నపుడు మధ్యలో ఎందుకు బ్రేక్‌ చేశారన్నది నాకు ఉన్న సందేహం….. టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టినపుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తరపున కూడా ప్రచారం చేశాను. ఎమ్మెల్యే అయ్యారు. దీనిని ఎవరికి ఇబ్బంది లేకుండా పరిష్కరించాలి. ఎవరిని రెచ్చగొట్టేలా రాజకీయాలు చేయకూడదు. కష్టనష్టాలు ఉంటే కమిషన్‌కు చెప్పాలి.’ అని పవన్ అభిప్రాయపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*