అద్భుతమైన రైలులో చిల్లర చేష్టలు

అత్యాధునిక సౌకర్యాలున్న రైలును ప్రారంభించారు. విమానంలో ఉన్న వసతులన్నీ రైల్వే శాఖ కల్పించింది. సుఖంగా ప్రయాణించాల్సిన రైలులో కొందరు ప్రయాణికులు లేకి తనానికి పాల్పడ్డారు. తేజస్ రైలులో ఎల్ఈడీ టీవీ స్క్రీన్లను చెడగొట్టారు. హైక్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్లను చోరీ చేశారు. వీరేమీ తక్కువ సొమ్ము పెట్టి ప్రయాణించి వారు కాదు. అందరూ చదువుకున్న వారే. కొద్దోగోప్పో సొమ్ము ఉన్న ప్రయాణికులే. గోవా నుంచి ముంబయికి తిరిగి వచ్చిన తేజస్ రైలును చూసి రైల్వే అధికారులే అవాక్కయ్యారు. రైలు మొత్తాన్ని ఛిద్రం చేశారు. దాని రూపు రేఖలే మార్చేశారు.

హెడ్ ఫోన్లు మాయం…..

ముంబయి నుంచి గోవాకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తేజస్ రైలును ఇటీవలే రైల్వే శాఖ ప్రారంభించింది. ఇందులో అన్ని హంగులూ కల్పించారు. ఆటోమేటిక్ డోర్లు, హెడ్ ఫోన్లు, టీ, కాఫీ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. అన్నీ ఏసీ బోగీలే. జనాలను ఆకర్షించేందుకు రైల్వేశాఖ చేసిన తొలిప్రయత్నానికి ప్రయాణికులే గండి కొట్టారు. మంగళవారం గోవా నుంచి ముంబయికి తిరిగొచ్చిన తేజస్ రైలును చూసి అధికారులు కంగుతిన్నారు. టీవీస్క్రీన్లపై గీతలు పడ్డాయి. దాదాపు 12 హైక్వాలిటీ హెడ్ ఫోన్లు కన్పించలేదు. రైలు మొత్తం చెత్త చెదారంతో నిండిపోయి ఉండటాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. రైల్వే శాఖకు నష్టం కల్గించవద్దంటూ రైల్వేశాఖ ప్రయాణికులను కోరుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*