అమిత్ షా….ఆపరేషన్‌ సౌత్

బీజేపీ దక్షిణాదిపై కన్నేసింది. 2018-19లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ప్రక్షాళన చేసే బాధ్యత ఇప్పటికే సంఘ్‌ నేపథ్యమున్న మురళీధర్‌రావు., రాంమాధవ్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి చేటు చేస్తోన్న నేతలపై వేటుతో పాటు సంస్థాగతంగా బీజేపీని బలపరిచే బాధ్యత వారికి అప్పగించారు. నిజానికి నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అంటే వెంకయ్యనాయుడి పేరే చెప్పేవారు. అయితే వెంకయ్యనాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారం కాలేదు. ఆయన రాజకీయ జీవితం మొత్తం జాతీయ రాజకీయాలతోనే ముడిపడి ఉంది. ఒకవేళ వెంకయ్యను ఏదొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ అధినాయకత్వం భావించి ఉంటే ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు ఎంపిక చేస్తుందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

ఏపీకి మురళీ….తెలంగాణకు రామ్ మాధవ్….

ఏపీలో బీజేపీని మోదీ-అమిత్‌షా స్టైల్లో నడిపించే నాయకుడి కోసం తీవ్ర కసరత్తు జరుగుతోంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒకింత తెలంగాణలోనే బలంగా ఉంది. అక్కడ గ్రామస్థాయిలో పార్టీకి కొంత మేరకు క్యాడర్‌ ఉంది. ఏపీలో పూర్తిగా టీడీపీతో అంటకాగడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందనే భావన బీజేపీ ముఖ్య నేతల్లో ఉంది. ఏపీలో బీజేపీ సాధించాల్సిన స్థానాల బాధ్యతను మురళీధర్‌రావుకు అప్పగించారు. అదే సమయంలో తెలంగాణ బాధ్యతలు రాంమాధవ్‌కు అప్పగించారు. కరీంనగర్‌కు చెందిన మురళీధర్ రావు ఇప్పటికే ఏపీలో కసరత్తు ప్రారంభించారు. కోనసీమకు చెందిన రాంమాధవ్‌‌కు దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ బాధ్యతలు ఉన్నాయి. 2014లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ సాధించిన బీజేపీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరో 150-160 స్థానాలను అదనంగా దక్కించుకోవాలని భావిస్తోంది. అందులోను దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 120 దక్కించుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. వీటిలో సగం సాధించినా బీజేపీ స్ట్రాటజీ విజయవంతం అయినట్లే….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1