అమెరికాలో రఘునందన్ కు మరణశిక్ష…!

పసిపాపను హత్య చేసిన కేసులో ప్రవాస భారతీయుడు రఘునందన్ కు వచ్చే నెల 23న మరణశిక్ష అమలుపర్చనున్నారు. ఒక భారతీయ అమెరికన్ కు ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. గత ఇరవై ఏళ్ల నుంచి పెన్సిల్వేనియాలో మరణశిక్షను అమలు చేయలేదు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడుకు చెందిన ప్రసాద్ రెడ్డి, లత కుటుంబం అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె శాన్విని చూసుకునేందుకు నాయనమ్మ సత్యవతి అమెరికా వెళ్లారు. అయితే ఈ కుటుంబానికి పరిచయం ఉన్న రఘునందన్ 2012లో సత్యవతిని, శాన్విని దారుణంగా హతమార్చాడు. యండమూరి రఘునందన్ ది విశాఖ. కేవలం డబ్బుకోసమే రఘునందన్ ఈ హత్యలు చేసినట్లు నిర్ధారణ అయింది. తొలుత తనకేమీ తెలియదని రఘునందన్ బుకాయించినా పోలీసుల విచారణలో వాస్తవం వెల్లడయింది. అయితే రఘునందన్ కు ఫిబ్రవరి 23న మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేయనున్నారు. శిక్షపై రఘునందన్ అప్పీల్ కు వెళ్లినా అక్కడ చుక్కెదురైంది. దీంతో రఘునందన్ కు మరణశిక్ష ఖరారయింది. అయితే పెన్సిల్వేనియా గవర్నర్ విధించిన ఆంక్షల కారణంగా రఘునందన్ కు ఊరట లభించే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1