ఇక మీ చేతినిండా డబ్బే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు స్వీట్ న్యూస్ చెప్పేసింది. నగదు ఉపసంహరణపై పరిమితులను సడలించింది. ఇప్పటి వరకూ సేవింగ్స్ అకౌంట్లో 24 వేలు, కరెంట్ అకౌంట్ లో యాభైవేలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ లిమిట్ ను మరింత పెంచింది. కరెంట్ అకౌంట్ నుంచి వారానికి లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఏటీఎంలలో నగదు విత్ డ్రా ను రూ.4,500ల నుంచి పదివేల రూపాయలకు పెంచింది.

గత ఏడాది నవవంబరు 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు రెండు నెలల పాటు కరెన్సీ కొరతతో జనం ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంలు కూడా తెరుచుకోలేదు. బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నించోలేక అల్లాడి పోయారు. అయితే గత వారం రోజుల నుంచి ఏటీఎంలు చాలా వరకూ తెరుచుకుంటున్నాయి. రూ.500 ల కొత్త నోటు కూడా బాగానే అందుబాటులోకి రావడంతో చిల్లర సమస్య కూడా కొంత తీరిందనే చెప్పవచ్చు. సరిపడా నగదును రిజర్వ్ బ్యాంకు ముద్రించడం వల్లనే కరెన్సీ కొరత తీరిందని చెబుతున్నారు. దీంతో కావాల్సినంత నగదు బ్యాంకులకు చేరడంతో నగదు ఉపసంహరణపై పరిమితిని మరింత పెంచే అవకాశముందంటున్నాయి ఆర్బీఐ వర్గాలు. ఈ వారంలో మరోసారి సమీక్ష జరిపి ఆర్బీఐ మరికొన్ని నిబంధనలను సడలించే అవకాశముందని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*