ఇదేంటీ పవన్…. ఇలా చేస్తే ఎలా?

ఓ మీడియా ప్రముఖుడి ఇంట్లో పెళ్ళి జరుగుతోంది., ప్రముఖులంతా ఆ పెళ్లికి తరలి వచ్చారు. అధికార., ప్రతిపక్ష నాయకులంతా మీడియా టైకూన్‌ ఇంట్లో వేడుక్కి హాజరయ్యేందుకు తరలి వచ్చారు. శనివారం రాత్రి జిఎంఆర్‌ ఏరినాలో జరిగిన పెళ్ళికి తెలంగాణ సిఎం కేసీఆర్‌., మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి., కాంగ్రెస్‌ నాయకుడు గులాం నబీ అజాద్‌., వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇలా ప్రముఖులంతా తరలి వచ్చారు. కానీ ఆ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చి లోపలకు రాకుండానే పవన్‌ వెళ్లిపోయారట. కేసీఆర్‌ కాన్వాయ్‌ కోసం పవన్‌ వాహనాన్ని పక్కకు పంపేయడంతో ఆయన మనస్తాపానికి గురై అట్నుంచి అటే వెళ్లిపోయారు. కేసీఆర్ ని చూసి తనను పట్టించుకోలేదని పవన్ అలక బూనారో., తన అంతటి వ్యక్తి పెళ్లికి వస్తే కారును పక్కకు నెట్టేస్తారా అని ఫీలయ్యారో కానీ అయ్యో పవన్‌ నొచ్చుకున్నాడా అని పెళ్లికి పిలిచిన వారు ఫీలవ్వాల్సి వచ్చిందట. పందిట్లోకి అడుగుపెట్టి పెళ్ళికి రావడానికి తటాపటాయించడం ఏంటని అక్కడున్న వారు షాక్‌ అయ్యారట. పవన్‌ చాలా పరిణితి చెందిన వ్యక్తి అలా ఎందుకు చేశారనే డౌట్ లు వ్యక్తమయ్యాయి.

ఏం జరిగింది…..?

మీడియా అధినేత కూతురి వివాహం శంషాబాద్‌ జిఎంఆర్‌ ఎరినాలో జరిగింది. ఈ పెళ్ళికి అతిరథ మహారథులంత హాజరయ్యారు. పెళ్ళికి హాజరవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మండపంలోకి రాకుండా ఎవరిని పలకరించకుండా, కనీసం కారైనా దిగకుండా వెళ్ళిపోయాడట.  పవన్ మ్యారేజ్ హాల్ కు ఎంటర్ అవుతున్నాడని సమాచారం రాగానే అందరు ఆయన్ను ఆహ్వానించడానికి ఎదురేగి వెళ్ళారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాహనం రావడంతో పోలీసులు మిగిలిన వాహనాలను పక్కకు మళ్ళించారు. పక్కకు మళ్లించిన వాహనాలలో పవన్ కారు కూడా ఉందట. దీనిని ఎవరు గమనించలేదు. తన కారును అలా పక్కకు పంపడంతో అవమానంగా భావించిన పవన్ కారు దిగకుండానే వెళ్ళిపోయాడు. ఆయన్ను శాంత పరిచేందుకు చేసిన చేసిన ప్రయత్నాలు ఫలించలేదట. కేసీఆర్‌ పెళ్లికి వచ్చిన కొద్ది నిమిషాల ముందు మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి., ఆ తర్వాత జగన్మోహన్‌ రెడ్డి వరుసగా వచ్చారు. కేసీఆర్‌ పెళ్లికి రావడానికి కొద్దినిమిషాల ముందే గులాం నబీ అజాద్‌., చిరంజీవి., ఇతర కాంగ్రెస్‌ నాయకులు., మాజీ మంత్రులు., ఏపీ మంత్రులు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. కొత్త జంటను ఆశీర్వదించడానికి వేదికపై రద్దీ ఉండటంతో 5-10 నిమిషాల పాటు కేసీఆర్‌ అక్కడే ఎదురు చూశారు. గులాం నబీ అజాద్‌, చిరంజీవిలతో కబుర్లు చెబుతూ ఉండిపోయారు. ఆ తర్వాత అజాద్‌., చిరంజీవి., రాంచరణ్‌లతో పాటు కేసీఆర్‌ వారిని ఆశీర్వదించి గ్రూప్‌ఫోటోకు ఫోజిచ్చారు. కోమటిరెడ్డి, దానం నాగేందర్‌ ఇలా చాలామంది నేతలు కేసీఆర్‌, అజాద్‌లతో పాటు కనిపించారు. వారు వెళ్లే వరకు జగన్‌ కూడా వేచి ఉన్నారు. వచ్చిన వాళ్లంతా మంత్రులు., ప్రముఖులు కావడంతో వేదిక మీద రద్దీ తగ్గే వరకు ఆగి వెళ్లడం కనిపించింది.

అర్ధముందా……?

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వస్తే పోలీసులు సహజంగానే ప్రోటోకాల్‌ పాటిస్తారు. అంత రద్దీ ఉన్న చోట వివిఐపిల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు జరగడం సహజం వాటిని అర్ధం చేసుకోకుండా అవమానంగా భావించడం ఎంతవరకు సబబనే ప్రశ్న వినిపిస్తుంది. పెళ్లికి వచ్చిన పవన్‌ పక్కకు నెట్టేశారని ఫీలయ్యే కంటే అంతమంది మధ్య కాస్త ఓపికను ప్రదర్శించి ఉంటే ఆయన ఇమేజ్‌ రెట్టింపై ఉండేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*