ఇవన్నీ టిఆర్ఎస్ కార్యకర్తల కోసమేనా ?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమన్వయ కమిటీలను నిర్వహించడం లో టిఆర్ ఎస్ కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషిస్తారని అసెంబ్లీ సాక్షిగా తేల్చారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా ధైర్యంగా ప్రకటించి ప్రజలకు పార్టీలకు గులాబీ పువ్వులు పెట్టారు టిఆర్ ఎస్ అధినేత. ఈ తరహా నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. లోపాయికారిగా తెరవెనుక జరిగే ఇలాంటి వ్యవహారాలను సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం దానిపై ఎవ్వరు నిలదీయకపోవడం విశేషం. ఆశ్రిత పక్షపాతం లేకుండా తర తమ భేదాలు లేకుండా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి ఇప్పుడు ఆ ప్రతినకు విరుద్ధంగా సర్కార్ నిర్ణయాలు సాగడం గర్హనీయం.

ఏపీలోనూ అంతే …..

రాజ్యాంగ విరుధ్హ కార్యక్రమాలు కొనసాగించడంలో తెలంగాణ సర్కార్ తో ఏపీ సైతం పోటీపడుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికలకు ముందు తరువాత అధికారపార్టీ వ్యవహరించడం అందరికి తెలిసిందే. ఇక కేవలం నంద్యాల పరిధిలోని ద్వాక్రా మహిళలకు మాత్రమే వారి రుణమాఫీకి ఇచ్చిన హామీపై నేరుగా వారి బ్యాంక్ ఎకౌంట్లకు ప్రభుత్వం జమచేసింది. రాష్ట్రంలో మిగిలిన వారికి ఈ డబ్బు వేయనే లేదు. అదేవిధంగా జన్మభూమి కమిటీలు వేసి వారి సిఫార్సులు ఉంటేనే ఏ పని అయినా అధికార యంత్రాంగం చేయాలనే నిర్ణయం తీసుకుని విమర్శల పాలు అయి వాటిని రద్దు చేయాలిసి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాల ధర్మ ప్రభువులు తమ పార్టీ క్యాడర్ కి పనికి ఆహారపధకంలా కార్యక్రమాలు రూపొందించడం దీనిపై విపక్షాలు ఈ వ్యవహారం తమకేమి సంబంధం లేనట్లు నడుచుకోవడం మరింత దారుణం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*