ఈ ఎమ్మెల్యే మంత్రిపదవికి కోసం ఏం చేశారో తెలుసా?

కేసీఆర్ ను నమ్ముకుంటే మంత్రి పదవి వస్తుంది. కాని ఈ ఎమ్మెల్యే కేసీఆర్ నమ్మలేదు. తన జాతకాన్ని నమ్ముకున్నాడు. పూజలు చేయిస్తే మంత్రి పదవి వస్తుందని బలంగా నమ్మాడు. అందుకోసం పూజలు చేయడానికి లక్షలు లక్షలు ఖర్చు చేశారు. కాని మంత్రి పదవి రాలేదు సరికదా? ఉన్న డబ్బూ ఊడ్చిపెట్టుకు పోయింది. మంత్రాలు…తంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఎవరో చదువుకోని వ్యక్తులు చేస్తే అయ్యో పాపం..అనొచ్చు. కాని లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి పూజలు చేస్తే వస్తుందటే నమ్మేశాడు. తర్వాత అడ్డంగా బుక్కయ్యానని గ్రహించాడు. చివరకు పోగొట్టుకున్న డబ్బు కోసం పోలీసులను ఆశ్రయించారు. అరకోటి పోగొట్టుకున్న తర్వాత గాని ఎమ్మెల్యేకి అసలు విషయం అర్థం కాలేదన్నమాట.

పూజలకు అరకోటి సమర్పించుకున్నప్పటికీ…….

వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యం కలుగుతోంది. వరంగల్ రూరల్ ప్రాంతానికి చెందిన  ఎమ్మెల్యే ధర్మారెడ్డి తనకు మంత్రి పదవి కావాలని బలంగా కోరుకున్నాడు. అయినా మూడేళ్లు గడిచినా రాలేదు. కేసీఆర్ కనికరం చూపలేదు. వరంగల్ జిల్లాలో మొత్తం టీఆర్ఎస్ లో 11 మంది శాసనసభ్యులున్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ తరుపున 8 మంది విజయం సాధించారు. తర్వాత టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూడా గులాబీ గూటికి చేరారు. దీంతో మొత్తం సంఖ్య 11 కు చేరింది. అయితే మంత్రివర్గంలో ప్రస్తుతం ఇద్దరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడియం శ్రీహరి, చందూలాల్ మంత్రులుగా ఉండగా, మధుసూదనాచారి స్పీకర్ గా ఉన్నారు. వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని ఎవరో చెప్పారట. దీంతో వరంగల్ రూరల్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎస్ఆర్ తోటకు చెందిన కొందరిని సంప్రదించారు. వారు మంత్రిపదవి రాకపోవడానికి, ఎమ్మెల్యేకు ఉన్న గ్రహదోషానికి ముడిపెట్టారు. దీంతో గ్రహదోషం పోవడానికి పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని భావించిన ఎమ్మెల్యే వారికి ఇప్పటి వరకూ యాభై లక్షల రూపాయాలు సమర్పించుకున్నారు. మంత్రి పదవి రాలేదు సరికదా….ఈ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా దొరకలేదట. దీంతో ఆయనకు విషయం అర్థమై సుబేదారి స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచినా…ఆ నోటా…ఈనోటా పాకి చివరకు బయటకు వచ్చింది. ఇది తెలిసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. దొంగబాబాల కోసం ప్రస్తుతం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రం తాను మంత్రి పదవికోసం పూజలు చేయించలేదని చెబుతున్నారు. కేవలం ఆరోగ్యం కోసమే పూజలు చేయించినట్లు వెల్లడించారు. కోయదొరలతో మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పూజలు చేయించినట్లు కోయదొరలు పోలీసుల విచారణలో వెల్లడించారని ధర్మారెడ్డి చెబుతున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1