ఈ బిడ్డకు విమానయానం జీవితకాలం ఫ్రీ…..

భూమికి 3500 అడుగుల ఎత్తులో పుట్టిన చిన్నారికి జీవితాంతం తమ విమానాల్లో ప్రయాణించే బహుమతిని జెట్‌ ఎయిర్‌ వేస్‌ ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున 2.55కి డామన్‌ విమానాశ్రయం నుంచి కొచ్చి బయలుదేరిన విమానంలో ప్రయాణిస్తోన్న మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి నెలలు నిండకుముందే ప్రసవ వేదన పడుతుండటంతో పైలట్‌ విమానంలో వైద్యులు ఉంటే సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో విమానం అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. భూమికి 3500 అడుగుల ఎత్తులో వెళ్తోన్న విమానం అటు వెనక్కు మళ్లలేని పరిస్థితి.

కేరళకు చెందిన నర్సు సహకారంతో…….

ఆ సమయంలో విమానంలో కేరళకు చెందిన నర్స్‌ మాత్రమే అందుబాటులో ఉండటంతో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో కలిసి ఆమె పురుడుపోయడంతో ప్రయాణికురాలు పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేసి తల్లి బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. తమ విమానంలో మొట్టమొదటిసారి జన్మించిన బాలుడికి జీవితాంతం తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని పుట్టిన రోజు కానుకగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. ఈ ఘటనతో విమానం 90నిమిషాల ఆలశ్యంగా గమ్యస్థానం చేరుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1