ఈ సీఎంలు సినిమా చూపిస్తున్నారే …!

సినిమాటోగ్రఫీ చట్టం పటిష్టంగా తయారు చేయబడింది. ఆ చట్టానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తూట్లు పొడిచేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సినిమాలు ప్రదర్శించకూడదు. కానీ ప్రత్యేక ప్రదర్శనల కోసం ప్రత్యేక జీవోలు జారీ చేసి మరి తమ అధికార దుర్వినియోగానికి తెలంగాణ, ఏపీలు నిస్సిగ్గుగా దిగజారిపోయాయి. తమకు రాజకీయంగా ప్రయోజనాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించి ఈ చట్ట విరుద్ధ పనులకు దిగుతుంటే ఇక అభిమాన సంఘాలు బెనిఫిట్ షో లపేరుతో ఫ్యాన్స్ నే దోపిడీ చేసేస్తున్నాయి. సినిమా హిట్ అయినా ఫట్ అయినా మొదటి నాలుగు రోజులు అన్ని థియేటర్లలో ఆడించి ప్రత్యేక షో లు ద్వారా భారీ ఎత్తున పంపిణీదారులు, నిర్మాత సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఒక మాఫియా మాదిరి సాగిపోతుంది.

జీవోలో ఏముంటుంది …?

అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు. అంతేనా టికెట్ ధర ఎంత పెంచుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు. దానిని బట్టి సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడం ఎందుకు ఒక్కో సినిమాకు ఒక్కోలా జీవోలు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న సగటు ప్రేక్షకుడి నుంచి ఎదురౌతుంది. బ్లాక్ లో అమ్మేసుకునేందుకు ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం చూసి అవాక్కవుతున్నారు. ఒకటి రెండు టికెట్లు బ్లాక్ లో అమ్మే వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేస్తూ వచ్చే వారు నేరుగా ధియేటర్లే బ్లాక్ లో టికెట్స్ అమ్మే విధానానికి దిగడం దారుణమని అంతా విమర్శిస్తున్నారు.

పైరసీకి దారితీస్తున్న అధికరేట్లు …

కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే మధ్యతరగతి జీవి తన నెల జీతం మొత్తం కేటాయించాలిసిన దుస్థితి. దానికి తోడు ప్రత్యేక షో లు మొదటి వారం రోజులు డబుల్ రేట్ కి టికెట్ కొని వెళ్ళాలి అంటే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే పైరసీగా వచ్చే వీడియో లు వైరల్ గా మారిపోతున్నాయి. ఆధునిక టెక్నాలజీ తో క్షణాలు నిమిషాల్లో పైరసీ వీడియో లు మార్కెట్ కి చేరిపోతున్నాయి. చక్కగా సినిమా థియేటర్లో బిగ్ స్క్రీన్ పై తిలకించాలిసిన సినిమాను అంతా అరచేతిలో వున్న మొబైల్ లో చూసేస్తున్నారు. ఈ పద్దతిని ఒకరకంగా సినీ పరిశ్రమ ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలు ప్రోత్సహిస్తున్నాయి. నాలుగు రోజుల తరువాత హిట్ సినిమా కూడా బోర్డు తిప్పేసి దుస్థితి దాపురించింది. పైరసీని పట్టించాలిసిన వారే అధిక ధరలకు డబ్బులు పోసి టిక్కెట్లు కొని చూడలేక ప్రోత్సహించేస్తున్నారు.

అజ్ఞాతవాసిలాగే…. బాలయ్య జై సింహ కు …

పవన్ అజ్ఞాతవాసికి ప్రత్యేక ప్రదర్శనలు ఎలా ఇచ్చారో ఇప్పుడు బాలయ్య నటించిన జై సింహ కు అలాంటి అనుమతులనే ప్రభుత్వం జారీ చేసింది. ఇవన్నీ చూసి చిన్న సినిమాలు తీసే వారు ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్న చిన్న బడ్జెట్ లతో ఎంతో సృజనాత్మకంగా సినిమాలు తీసే తమకు ఎలాంటి ప్రోత్సహం లభించడం లేదని వాపోతున్నారు. బడా హీరో ల సినిమాలకు ఒకలా చిన్న సినిమాలకు హీరోలకు ఒకలా న్యాయం చేయడాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. చిన్న సినిమాలకు అసలు ధియేటర్లే లేకుండా ఒక పక్క మాఫియా తన దందా నడుపుతుంటే వీరికి మాత్రం దొడ్డి దారిలో అనుమతులు రాత్రికి రాత్రే ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. ఇక ఎలాంటి విమర్శలు ఎదురైనా అయినవాళ్ళకి కంచాల్లో కానీ వారికి ఆకుల్లో పెట్టె ప్రభుత్వాలముందు చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లే మరి. ఇక అలాంటి పరిస్థితుల్లో సినిమాటోగ్రఫీ చట్టం ఎవరికోసం ఎత్తేస్తే పోలా …

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1