ఉండవల్లి, గోరంట్లలో గెలుపెవరిది?

దమ్ముంటే చర్చకు రండి … నాది తప్పని నిరూపించండి అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ పదే పదే విసిరిన సవాల్ స్వీకరించి చర్చకు రమ్మన్నారు రాజమండ్రి రురల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి . జులై 18న విజయవాడ కృష్ణా బ్యారేజ్ వేదిక గా ఎంచుకున్నారు. సమయం ఉదయం 11 గంటలుగా నిర్ణయించారు. ఇద్దరు చర్చకు సై . పోలీస్ అనుమతికి లేఖ రాశారు గోరంట్ల అది రావాల్సి వుంది . తన పక్షాన కృష్ణా రైతులు , పార్టీ క్యాడర్ వస్తారని లేఖలో పేర్కొన్నారు . ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించాలని అందుకే చర్చ అని లేఖలో వెల్లడించారు . చర్చకు ముందు ఇద్దరు నేతలతో మాట్లాడినప్పుడు గోరంట్ల ఈవిధంగా స్పందించారు . చాలా కాలంగా ఉండవల్లి ఆరోపణలు చేస్తూ వస్తున్నారని, వాటికి చర్చతో సమాధానం ఇస్తానని గోరంట్ల చెబుతున్నారు. కృష్ణ డెల్టా కు నీరు లేక అల్లాడుతుంటే పట్టిసీమ ద్వారా నీరిచ్చి పంటలను ప్రభుత్వం కాపాడిందని, ఉండవల్లి పట్టిసీమ దండగ అంటున్నారన్నారు . తాము మాత్రం పండగ అంటున్నామని, కాగ్ నివేదిక ఏమిటో దాని సంగతి కూడా తెలుస్తానని గోరంట్ల చెబుతున్నారు . సోనియా వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని, ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగిపోయిందని, దీనిపై అన్ని విషయాలనూ తాను మాట్లాడతానన్నారు గోరంట్ల. తనతో బాటు రైతులు మాట్లాడతారని, చర్చకు ఇంత సమయం అని నిర్ణయించుకోలేదని చెప్పారు. ఈ చర్చకు సంబంధించి ముఖ్యమంత్రిని కానీ ఇరిగేషన్ మంత్రుల అనుమతిని తాను కోరలేదన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమేనని చెప్పారు. పోలవరం పై ఉండవల్లి చెప్పింది బోగస్ అని, వైసిపి వారి అనుబంధ సంఘాల తరపు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఉండవల్లిని కృష్ణా లో తన్నితరిమేస్తారని తాను అనలేదని, పోలీసులు అనుమతి ఇస్తారనే భావిస్తున్నానని. మరోసారి కమిషనర్ తో మాట్లాడతానని చెప్పారు మాజీ మంత్రి గోరంట్ల .

అన్ని పత్రాలతో సిద్ధమైన ఉండవల్లి……

గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ కుమార్ ను స్పందన కోరగా ఆయన తనదైన శైలిలో స్పందించారు . సమాచార హక్కు ద్వారా లభించిన సమాచారం తోనే తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని తన ప్రశ్నలకు గోరంట్ల సమాధానం చెప్పి ఒప్పిస్తే తప్పయితే క్షమించమని కొరతానని అన్నారు . అధికారపార్టీలో ఉండి తనఆరోపణలను బోగస్ అనక మరొకటి గోరంట్ల ఎలా అంటారని ఎద్దేవా చేశఆరు.చర్చ జరిగితే మీడియా , ప్రజలు చూసి నిజం ఏమిటో తెలుసుకుంటారని చెప్పారు . ఈ ప్రాజెక్టులపై అసెంబ్లీలో సరైన చర్చను జరక్కుండా ప్రభుత్వం అడ్డుకుందని , అవే ప్రశ్నలు నేను చర్చలో బుచ్చయ్యను అడుగుతానని వివరించారు . కృష్ణా రైతులకు ఈ ఏడాది నీరొచ్చినందున వారు ఆనందంగా వున్నారని కనుక టిడిపి చెప్పింది నిజమని నమ్ముతారని మూడేళ్లనుంచి చర్చ కు పిలిచినా రాలేదని ఈ ఏడాది గోరంట్ల ఒప్పుకున్నారని , వారితో జై కొట్టించుకోవాలనే ప్రయత్నంలో రైతులను చర్చకు పిలిచారని అన్నారు . టిడిపి క్యాడర్ , రైతులకు నిజాలు తనద్వారా తెలుస్తుందని , నంద్యాల ఉపఎన్నిక ప్రచారం కూడా 18 న బంద్ చేసి టివిల ముందు వాస్తవాన్ని జనం గ్రహిస్తారని చెప్పారు ఉండవల్లి . తాను అక్కడికి వస్తే తన్ని తగలేస్తారన్న గోరంట్ల ఆ పని చేయాలంటే రాజమండ్రిలో చాలని అంత దూరం అవసరం లేదని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్న తాను ప్రశ్నిస్తే వైసిపి అనుబంధం అనడం సరికాదన్నారు . తనను బలవంతంగా వైసిపిలోకి జాయిన్ చేసేలా వున్నారని వ్యంగ్యాస్థ్రాలు సంధించారు ఉండవల్లి .

18న చర్చకు పోలీస్ లు అనుమతి ఇస్తారా ?

జులై 18 న ఉండవల్లి , గోరంట్ల చర్చకు పోలీసుల అనుమతి లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది .17 రాష్ట్రపతి ఎన్నిక. 18 న ఏపీ కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో వీరి చర్చకు పోలీసులు అనుమతి ప్రశ్నార్ధకమే అయినా చర్చ జరిగి తీరుతుందని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు . దమ్ముంటే చర్చకు రా అని సవాళ్లు విసురుకోవడమే కానీ బహిరంగ వేదికలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పటివరకు కొత్త రాష్ట్రంలో ఇలాంటి చర్చ ఇప్పటి దాకా జరగలేదు . ఒకవేళ ఈ చర్చ సజావుగా జరిగితే సరికొత్త సంప్రదాయానికి ఉండవల్లి , గోరంట్ల తెరతీసిన వారు అవుతారు .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1