ఉత్తమ్ సీఎం అయినట్లేనా?

ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడే తాను సీఎం అయిపోయినట్లు కలలు కంటున్నారా? ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్లేనని ఆయన ఫుల్ డ్రీమ్స్ వేసుకుంటున్నట్లుంది. పార్టీకి రధసారధిగా ఉండే వ్యక్తి పార్టీ కార్యక్రమాలకు కొన్నింటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొన్నింటికి హజరవుతున్నా నేతలు భరించలేని ఆలస్యంగా వస్తున్నారు. ఇక ఢిల్లీ చుట్టూ తిరగడమే ఉత్తమ్ పనిగా పెట్టుకున్నారు. ఏమాత్రం సందు దొరికినా వెంటనే రాహుల్ ముందుకు వెళ్లి తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని తెగ చెప్పేస్తున్నాడన్నది గాంధీభవన్ లో టాక్. అధికార టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి చేరిన తర్వాత వరుసగా పార్టీలో చేరికలు ఉండటంతో పీసీసీ చీఫ్ గా తనకు ప్రమోషన్ రావడం ఖాయమని, సీఎం సీటు దక్కినట్లేనన్న భ్రమలో ఉన్నారు ఉత్తమ్.

ప్రతి కార్యక్రమానికి ఆలస్యంగానే….

అందుకే పార్టీ కార్యక్రమాలకు చాలా ఆలస్యంగా వస్తున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా హాజరైన సమావేశానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు గంటలు ఆలస్యంగా రావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఉత్తమ్ లో మార్పును గమనిస్తున్నామంటున్నారు నేతలు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలంటూ చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకూ ర్యాలీ చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేసింది పీసీసీ. ఉదయం 11 గంటలకల్లా అందరూ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. కుంతియా కూడా వచ్చారు. కాని ఉత్తమ్ రాలేదు. కార్యకర్తలు, నేతలు ఎండలో నిల్చునే ఉన్నారు. ఉత్తమ్ వస్తే గాని కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వీల్లేదు. కాని ఉత్తమ్ సుమారు 12.30గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. కొందరు సీనియర్ నేతలైతే అక్కడే ఉత్తమ్ ను దులిపేశారట. పనులు ఉంటే కార్యక్రమాన్ని 12.30గంటలకే పెట్టుకునే వాళ్లం కదా? అని ప్రశ్నించారట. అయితే ఉత్తమ్ సారీ చెప్పడంతో ఇక కార్యక్రమాన్ని ప్రారంభిచారు కాని, కొందరు కుంతియాకు కూడా ఉత్తమ్ వరుసగా ఆలస్యంగా ఈ మధ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఫిర్యాదు చేశారట. తానేదో ముఖ్యమంత్రిని అయినట్లు ఫీలయిపోతున్నారన్న వ్యాఖ్యలు కూడా అక్కడ కొందరు నేతలు చేయడంతో కుంతియా సర్దిచెప్పాల్సి వచ్చిందట. సో…ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యానికి కారణాలేంటో తెలియదు కాని, ఆయన ముఖ్యమంత్రిగా అయిపోయినట్లే ఫీలవుతున్నారని పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1