ఉత్తరాఖండ్ కమలనాధులదే

ఉత్తరాఖండ్ లో బీజేపీ హవా కొనసాగిందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడయింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అందులో బీజేపీ 46 నుంచి 53 సీట్లు దక్కించుకునే అవకాశముందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో స్పష్టమైన మెజారిటీ బీజేపీ సాధిస్తుందని సర్వే ఫలితాలు చెప్పాయి. ఉత్తరాఖండ్ లో మ్యాజక్ ఫిగర్ 36 ఉండగా దానికి మించే సీట్లు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో స్పష్టమైంది. ఇక ఇక్క కాంగ్రెస్ కు కేవలం 12 నుంచి 21 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. బీఎస్సీ ఒకటి నుంచి రెండు స్థానాలు, ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాలు దక్కించుకుంటారని సర్వేల ద్వారా తేలిపోయింది. దీంతో ఉత్తరాఖండ్ బీజేపీ పరమైనట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తేలింది. చాణక్య సర్వే ప్రకారం బీజేపీ ఉత్తరాఖండ్ లో విజయం సాధిస్తుందని చెప్పింది. సీఓటర్ సర్వే ప్రకారం ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉందని తెలిపింది.

మణిపూర్, గోవాలోనూ….

ఇక మణిపూర్ లోనూ బీజేపీ గాలి బలంగా వీచిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. మణిపూర్ లో మొత్తం 70 స్థానాలుండగా బీజేపీకి 25 నుంచి 35 స్థానాలు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 23 స్థానాలు దక్కించుకుంటుందని, ఇతరులకు 9 నుంచి 15 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే కొన్నేళ్ల తర్వాత మణిపూర్ లో కమలనాధులు పాగా వేయనున్నారు. ఇక గోవా విషయానికొస్తే బీజేపీ కూటమి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ కూటమికి 15 నుంచి 22 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని స్పష్టమైంది. మరోసారి గోవా పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ కూటమికి గోవాలో 12 నుంచి 18 స్థానాలు వస్తాయని, ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇతరులు రెండు నుంచి ఎనిమిది సీట్లను గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సర్వే బట్టి వెల్లడయింది. గోవాలో ఆప్ కు చుక్కెదురయిందని ఎగ్జిట్ పోల్స్ ను బట్టి స్పష్టమయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*