ఊపందుకున్న జల్లికట్టు ఆందోళన

తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా మెరీనాబీచ్ లో యువత నిరసన నాల్గోరోజుకు చేరింది. తమిళనాడులో ఈరోజు వాణిజ్య, విద్యా సంస్థలన్నీ బంద్ ను పాటిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న ప్రధాన డిమాండ్ తో ఆందోళన జరుగుతోంది. రవాణా మొత్తం స్థంభించిపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడంతో పూర్తి స్థాయి బంద్ కొనసాగుతోంది. డీఎంకే కార్యకర్తలు రైల్ రోకోను నిర్వహించడంతో తమిళనాడకు వచ్చే రైళ్లు నిలిచిపోయాయి. తమిళనాడుకు వెళ్లే బస్సులను ఇతర రాష్ట్రాలు నిలిపివేశాయి.

ఉద్యమానికి తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలుపుతోంది. నడిగర్ సంఘం కార్యాలయంలో సీనీతారలందరూ ఈరోజు దీక్షలో పాల్గొంటున్నారు. జల్లికట్టుకు మద్దతుగా తాము ఒకరోజు దీక్ష చేపట్టామని, షూటింగ్ లు మొత్తం నిలిపేసినట్లు వారు చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలయినంత త్వరగా కేంద్ర బృందాన్ని రప్పించి సమస్యకు పరిష్కారం చూపాలని పన్నీర్ మరోసారి కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*