ఎంపీ జేసీ ఢిల్లీకి ఎగిరే వెళ్లారు

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు. ఆయన పై విమానయాన సంస్థలు నిషేధం విధించడంతో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకుని మరీ వెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడంతో జేసీపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ ఆయన విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో జేసీ రోడ్డు మార్గానే విజయవాడ వెళ్లాల్సి వచ్చింది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని జేసీకి సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంది.

కేంద్రమంత్రులను నేడు కలిసే అవకాశం…

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఏకంగా తన ఒక్కడి కోసం జేసీ ఒక ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు. అందులోనే ఢిల్లీ వెళ్లారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి పౌరవిమానయాన సంస్థ మంత్రి అశోక్ గజపతిరాజును, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జేసీ సమావేశం కానున్నారు. అయితే విమానయాన సిబ్బందికి తాను క్షమాపణ చెప్పేది లేదని జేసీ ఖరాఖండీగా చెబుతున్నారు. మహా ఉంటే తనపై మూడు నెలల పాటు నిషేధం ఉంటుందని, తర్వాత దానిని ఎత్తివేస్తారన్న ధీమాలో జేసీ ఉన్నారు. మొత్తం మీద ఎయిర్ లైన్స్ సిబ్బంది నిషేధం విధించినా ప్రత్యేక విమానంలో జేసీ బయలుదేరి వెళ్లారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1