ఎంపీ జేసీ ప్యారిస్ ఎగిరిపోయారు

టీడీపీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి నిషేధం ఉన్నా విదేశాలకు వెళ్లిపోయారు. పది రోజుల పాటు ప్యారిస్ లో గడిపేందుకు ఎంచక్కా ఆయన విమానమెక్కేసి వెళ్లిపోయారు. ఎంపీ దివాకర్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వీరంగం వేసిన ఘటన దేశమంతా కుదిపేసింది. దీంతో జేసీపై విమానయాన సంస్థలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఇండిగో, ఎయిర ఇండియా, స్పైస్ జెట్ తో పాటుగా ఎయిర్ ఏషియా, విస్తారా, గో ఎయిర్ సంస్థలు కూడా జేపీ విమాన ప్రయాణంపై నిషేధం విధించాయి. దీంతో జేసీ ఇక ఫ్లైట్ లో ఎక్కడికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లయింది. అయితే విమానయాన సంస్థల సిబ్బందిపట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ పెరుగుతోంది.

క్షమాపణ చెప్పాల్సి వస్తుందనేనా..?

తెలుగుదేశం పార్టీ కూడా జేసీ చేత క్షమాపణ చెప్పించాలని భావించింది. కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లను జేసీ ఇంటికి పంపి జరిగిన ఘటనపై క్షమాపణ లేఖను పౌరవిమానయాన శాఖకు ఇవ్వాలని సూచించారు. అయితే జేసీ మాత్రం క్షమాపణ చెప్పేందుకు ససేమిరా అంటున్నారు. మరోవైపు కేంద్ర పౌరవిమానయాన శాఖ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దీంతో శుక్రవారమంతా జేసీ ఢిల్లీలోని తన ఇంటికే పరిమితమయ్యారు. కాని సాయంత్రానికి ప్యారిస్ చెక్కేశారు.ఆయన ఎమిరేట్స్ ఫ్లైట్స్ లో ప్యారిస్ వెళ్లిపోయారు. జేసీ స్వదేశీ ప్రయాణంపై నిషేధం ఉన్న సంగతి ఎమిరేట్స్ కు తెలియకపోవడంతో ఎంచక్కా జేసీ ప్యారిస్ చెక్కేశారు. క్షమాపణ చెప్పాల్సి వస్తుందనే ఆయన విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

1 Comment on ఎంపీ జేసీ ప్యారిస్ ఎగిరిపోయారు

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1