ఎన్టీఆర్ బయోపిక్ లు జనాలను పిచ్చెక్కిస్తాయా ?

తేజా డైరెక్షన్ లో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తీస్తున్న ఒక బయోపిక్ రాబోతుంటే మరో చిత్రం రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. వర్మ చిత్రం వివాదాస్పదం కాగా లక్ష్మీస్ వీరగ్రంధం పేరుతో కేతిరెడ్డి చిత్రం మొదలు పెట్టి హల్చల్ చేస్తున్నారు. ఇలా పోటా పోటీగా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మైమరపిస్తాయో లేక పిచ్చెక్కిస్తాయో తెలియడం లేదు కానీ రోజు మీడియా లోను సోషల్ మీడియా లో ఈ మూడు చిత్రాలపై సెటైర్స్ మీద సెటైర్స్ పడుతున్నాయి. ఇలా ఎవరికి వారు పోటా పోటీగా తీస్తున్న చిత్రాలన్నీ వచ్చే ఎన్నికలముందు సిల్వర్ స్క్రీన్ కి చేరి రాజకీయవేడి మరింత రాజేయనున్నాయి.

లక్ష్మీస్ వీరగంధాన్ని అడ్డుకున్న నిమ్మకూరు వాసులు…..

తాజాగా కృష్ణ జిల్లా లో ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరు ప్రాంతంలో లక్ష్మీస్ వీరగంధం చిత్ర నిర్మాణం ప్రారంభం అయ్యింది. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్థులు చిత్ర నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీనిపై కేతిరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం తొలిభాగం తేజా తీస్తుంటే , రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆయన జీవిత చివరి భాగాన్ని తీస్తున్నారని మధ్య భాగం మిగిలిపోయిందని కనుక ఆ లోటు తాను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మీస్ వీరగ్రంధం అని టైటిల్ పెట్టి ట్యాగ్ లైన్ కూడా ఆదర్శ గృహిణి అని మంచిగానే పెట్టానని వెల్లడించారు. సన్యాసిగా రాజకీయాల్లో కొనసాగిన ఎన్టీఆర్ సంసారిగా ఎలా మారారు అన్నదే తన పాయింట్ అంటున్నారు కేతి రెడ్డి.

ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారు….?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. అయితే ఆయన జీవితంలో ఎవరికి తెలియని ఆసక్తికర అంశాలు తెరకు ఎక్కిస్తే ప్రేక్షకాదరణ లభిస్తుంది. వాటితో పాటు అందరికి తెలిసిన కీలక ఘట్టాలను వినూత్న రీతిలో తెరకు ఎక్కిస్తే మరింత ఆదరణ అందుకుంటాయి . తాజాగా తీసే ఈ మూడు చిత్రాల్లో తేజా, వర్మ తీసే చిత్రాలపై అందరిలో ఆత్రుత మొదలైంది. తేజా, వర్మ ఇద్దరూ మంచి చిత్రాలను తీసి అద్భుత విజయాలను అందుకున్నారు ఎవరు చూడని పరాజయాలు చవిచూశారు. ఇప్పుడు తెలుగు ప్రజలు ఉత్కంఠ తో ఎదురు చూసే వీరి చిత్రాల్లో ఎవరిది హిట్ ఎవరిది ఫట్ అవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1