ఎన్నాళ్లకెన్నాళ్లకు….?

పరాయి గడ్డపై భారత్ విజయకేతనం ఎగురవేసింది. బ్లూమెన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సఫారీ గడ్డపై భారత్ పాతికేళ్ల తర్వాత సిరీస్ ను చేజిక్కించుకుంది. పోర్ట్ ఎలిజిబెత్ స్టేడియంలో గత రికార్డులను తిరగరాసింది. భారత్ గతంలో ఆరు సార్లు పర్యటించినప్పటికీ ఒక్కసారి కూడా వన్డే సిరీస్ ను చేజిక్కించుకోలేకపోయింది. కాని కోహ్లీసేన ఈసారి తమ విజయాలకు తిరుగులేదని నిరూపించుకుంది. సఫారీలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది.

రోహిత్ సెంచరీ…..

పోర్ట్ ఎలిజిబెత్ స్టేడియంలో భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఐదో వన్డే ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఒక వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. భారత్ 73 పరుగులతో విక్టరీ కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ యాభై ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఈ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేశారు. 126 బంతులు ఆడిన రోహిత్ 115 పరుగులు చేశారు. రోహిత్ వన్డేల్లో 17వ సెంచరీ చేయడం విశేష:. కోహ్లీ 34 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ 23 పరుగులు చేశారు.

మరోసారి స్పిన్నర్ల హవా….

ఆ తర్వాత బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తొలి 9 ఓవర్లు నిలకడగానే ఆడింది. తర్వాత హార్ధిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు మార్ క్రమ్, డుమిని ని ఔట్ చేయడంతో దక్షిణా ఫ్రికా కొంత ఇబ్బందుల్లో పడినట్లయింది. ఆ తర్వాత ఆమ్లా నిలదొక్కుకున్నాడు. సింగిల్స్ ఎక్కువగా తీస్తూ, అప్పుడప్పుడూ ఫోర్లు బాదుతూ ఆమ్లా మ్యాచ్ ను గెలిపిస్తాడనే అనిపించింది. అయితే ఆ తర్వాత స్పిన్నర్లు చాహల్, కులదీప్ లు విజృభించడంతో దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆమ్లా రనౌట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఆమ్లా అప్పటికే71 పరుగులు చేశారు. ఇక ఆటగాళ్లు వరుసగా పెవిలెయన్ దారి పట్టడంతో భారత్ నే విజయాన్ని వరించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*