ఎవరైతే నాకేంటి?

బీఎస్సీ అధినేత్రి మాయావతి అందరి లాంటి వ్యక్తి కారు. విలక్షణమైన మనస్తత్వం ఉన్న ఐరన్ లేడీ. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంచలనమే. పార్టీలో గాని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాని మాయా నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమయ్యాయి. మరికొన్ని సంచలనాలయ్యాయి. అయితే తాజాగా మాయావతి మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీలు ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను అనుసరించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు అందజేసింది.

సుప్రీం ఆదేశాలను సయితం….

ముఖ్యమంత్రులుగా పనిచేసి మాజీలుగా మారి కొన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయలేదు. వారు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో సమాజ్ వాదీ పార్టీ అగ్రనేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, బీజేపీ నేత కల్యాణ్ సింగ్, మాయావతి, ఎన్డీ తివారి వంటి వారు ఉన్నారు. అయితే ఎన్డీ తివారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున బంగళాఖాళీ చేయడానికి తమకు కొంత సమయం కావాలని ఎన్డీ తివారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఖాళీ చేయను పొమ్మన్న…..

అలాగే ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ లు కూడా తమకు కొంత సమయ మివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్యాణ్ సింగ్ మాత్రం బంగళా ఖాళీ చేసే పనిలో పడిపోయారు. కాని వీరందరికి విరుద్ధంగా మాయావతి మాత్రం తాను ఖాళీచేయను పొమ్మన్నారు. తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాను ఖాళీచేసేది లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మాయా లేఖ రాశారు. తాను నివాసముంటున్న 13 ఎ మాల్ ఎవెన్యూ బంగళా బీఎస్సీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జ్ఞాపకార్థం మార్చారని, అందులో తాను రెండు గదుల్లోనే ఉంటున్నానని మాయావతి తెలిపారు.

కాన్షీరామ్ జ్ఞాపకార్థం…..

కాన్షీరామ్ జ్ఞాపకార్థం తో ఏర్పాటు చేసిన బంగళాను రక్షించడమే తన పని అని మాయావతి కుండబద్దలు కొట్టేశారు. తాను స్వయంగా చూసుకుంటుంన్నందునే బంగళా సురక్షితంగా ఉందని చెప్పారు మాయావతి. తనకోసం లాల్ బహూదర్ శాస్త్రి మార్గ్ లో కేటాయించిన ప్రభుత్వ బంగళాను మాత్రం ఖాళీ చేస్తానని మాత్రం మాయా చెప్పారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు మాయావతి లేఖ రాశారు. మరి యోగి ఆదిత్యానాథ్ మాయావతి లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*