ఎస్ త్రీ మూవీ రివ్యూ

నటీనటులు: సూర్య, అనుష్క, శృతి హాసన్, ఠాకూర్ అనూప్ సింగ్
మ్యూజిక్ డైరెక్టర్ : హర్రీస్ జయరాజ్
ప్రొడ్యూసర్: మల్కాపురం శివ కుమార్
డైరెక్టర్ : హరి

ఎస్ త్రీ చిత్రం పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్ లో సందడి చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ చిత్రం గత డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా జయ మరణంతో జనవరికి పోస్ట్ పోన్ అవగా… జనవరిలో కూడా చెన్నై తుఫాను కారణంగా మళ్ళీ జనవరి నెలాఖరుకి విడుదల తేదీ ప్రకటించుకుంది. ఇక ఎస్ త్రీ విడుదలవుతుంది అని అనుకున్న సమయంలో తమిళనాట జల్లికట్టు సమస్య కారణంగా మళ్ళీ ఈ చిత్రం విడుదల ఫిబ్రవరికి మారింది. ఇక ఎట్టకేలకి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్న టైమ్ లో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్ త్రీ మార్నింగ్ షోస్ రద్దయ్యాయి. పాపం సూర్య ఎస్ త్రీ సినిమాకి ఎన్నో అడ్డంకులు అవాంతరాల మధ్యన మ్యాట్నీ షో తో ప్రారంభమైన ఈ చిత్రం ఎలాంటి ప్రభంజాన్ని సృష్టించబోతుందో తెలుసుకుందాం.

డైరెక్టర్ హరి – సూర్య కాంబినేషన్ సింగం సీరీస్ తో ప్రభంజనం సృష్టిస్తున్నారు. సింగం 1 దగ్గర నుండి వీరి కాంబినేషన్లో సింగం 2 కూడా సెన్సేషన్ హిట్ అయ్యింది . ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో వచ్చిన సింగర్ 3 మీద విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటివరకు సూర్య తన పవర్ ని సింగర్ పార్ట్ 1 , పార్ట్ 2 లో ఆల్మోస్ట్ చూపించేసాడు. మరి ఎస్ త్రీ లో ఇంకా ఏం ప్రెజెంట్ చేయబోతున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది. సూర్య యాక్షన్, నటన వంటి అంశాలతో హరి పవర్ ఫుల్ డైరెక్షన్ తో సింగం సీరీస్ తిరుగులేని హిట్స్ సాధించాయి. ఇక సింగం  సిరీస్ మొదలయినప్పటినుండి డైరెక్టర్ హరితో, హీరో సూర్య తో ట్రావెల్ చేస్తున్న అనుష్క కూడా ఎస్ త్రీ కి ప్లస్ కానుంది. సిగం 1 లో సూర్య ప్రేమికురాలిగా కనిపించి అదే ప్రేమికురాలిగా సింగం 2 లో కూడా నటించింది. మరి ఎస్ త్రీ లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది. మరి ఎస్ త్రీ లో నైనా సూర్యని పెళ్లాడుతుందా అనుష్క అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఈ ఎస్ త్రీ చిత్రానికి మరో ఎట్రాక్షన్ శృతి హాసన్. శృతి ఇప్పటివరకు వచ్చిన సింగం పార్ట్ 1 లోగాని పార్ట్ 2 లో గాని లేదు. సింగం సీరీస్ లో మొదటిసారి శృతి హాసన్ కనబడబోతుంది. మరి శృతి కేరెక్టర్ ని హరి ఎలా డిజైన్ చేసాడో చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నారు. ఇక ట్రైలర్స్ తో ,సాంగ్స్ తో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన ఎస్ త్రీ ఎలా వుండబోతుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: పోలీసాఫీసర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని రౌడీలా గుండెల్లో నిద్రపోతున్న ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ నరసింహ (సూర్య)ను వేరే రాష్ట్రానికి చెందిన హోం మంత్రి (శరత్ బాబు) ఒక ముఖ్యమైన పని మీద ప్రత్యేకంగా మంగళూరుకు డెప్యుటేషన్‌పైన తీసుకువస్తాడు. అక్కడ ఒక పోలీస్ కమీషనర్ హత్యకు సంబంధించిన కేసు బాధ్యతలను నరసింహకు అప్పగిస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వున్న విఠల్‍ తో సూర్య ఏ విధం గా ఢీ కొంటాడు? అసలు కమిషనర్ ఎందుకు హత్య చెయ్యబడతాడు? అలాగే ఈ ఎస్ త్రీ లోనైనా సూర్యా అనుష్క ని పెళ్లాడాడా? ఇందులో శృతి హాసన్ పాత్ర ఏమిటి? అనేది వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటులు: సూర్య పోలీస్ పాత్రలో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. పోలీస్ అంటే ఇలానే ఉండాలని అనిపించేలా సింగం సిరీస్ లో సూర్యని చూస్తూ వున్నాం. ఇక సూర్య యాక్షన్, నటనతో మళ్ళీ ప్రేక్షకులని మేస్మ్రైజ్ చేసాడు. పోలీస్ పాత్రకి తగినట్టుగా సూర్య పెరఫార్మెన్సు అదుర్స్. సింగం సీరీస్ లో  సూర్య మీద పెట్టుకున్న అంచనాలను సూర్య రీచ్ అయ్యాడని ఒప్పుకుంటారు. ఎమోషన్ సీన్స్ లో సూర్య జీవించేసాడు. ఇకపోతే అనుష్క ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ఇక శృతి హాసన్ ఆమె పాత్రకి న్యాయం చేసింది. నటన పరం గా, గ్లామర్ పరంగా కూడా శృతి హాసన్ మెప్పించింది. ఇక సూర్యతో ఉన్నపాటల్లో శృతి అందాల ఆరబోత సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ వుంది. ఇక విలన్ గా ఠాకూర్ అనూప్ సింగ్ బలమైన పాత్రలో నటించాడు. విలనా పాత్రలో అతను ఒదిగిపోయి నటించాడు.

సాంకేతిక వర్గం: దర్శకుడు హరి యాక్షన్ దర్శకుడుగా పేరుపొందాడు. హరి, సింగం సీరీస్ తో మొదటి నుండి కాన్ఫిడెంట్ గానే వున్నాడు. అతను అనుకున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాని పర్ ఫెక్టుగానే ఎస్ త్రీ తో ప్రెజెంట్ చేసాడు. అయితే సింగం 1 లో ,సింగం 2 లో కూడా సూర్య పాత్రని విలన్ ని పట్టుకోవడం కోసమే పోలీస్ డ్రెస్ వేసినట్టు చూపించేసాడు. మరి ఎస్ త్రీసరిగా ప్రెజెంట్ చెయ్యలేకపోయాడు. కేవలం యాక్షన్ ని నమ్ముకునే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడా అనిపిస్తుంది. ఈ చిత్రానికి కథ లో బలం లేకపోవడం వల్ల కేవలం యాక్షన్, ఫైట్స్ మీదనే ఆధార పడాల్సి వచ్చింది. ఇక రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫి మెయిన్ హైలెట్స్ గా నిలుస్తాయి. హరీష్ జైరాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అదుర్స్ అనిపించే రీతిలో చితక్కొట్టేసాడు. ఇక పాటలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

ప్లస్ పాయింట్స్: సూర్య నటన, యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , డైరెక్టర్
మైనస్ పాయింట్స్: కామెడీ, కథ, పాటలు

రేటింగ్   2 .5 /5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*