ఏం కావాలి? చెప్పమ్మా…చిన్నమ్మా…?

చిన్నమ్మ మరికాసేపట్లో జైలు కెళ్లబోతున్నారు. అయితే ఆమెకు జైల్లో సకల సౌకర్యాలు కల్పించాలని లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ జైలుఅధికారుల్లో కలకలం రేపింది. జైలులో తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని లేఖలో జైలు అధికారిని కోరారు. ఏసీ గదితో పాటు రోజు ఇంటి నుంచి ఆహారాన్ని తనకు అందించాలని చిన్నమ్మ కోరుతున్నారు. తనకు షుగర్ వ్యాధి ఉన్నందున బయట ఆహారం పడదని, నిత్యం ఇంటి నుంచే ఆహారం వచ్చేలా చూడాలని కోరారట. అలాగే తన గదిలో ఏసీతో పాటుగా ఒక టీవీ, మినరల్ వాటర్ సదుపాయాన్ని కూడా కల్పించాలని చిన్నమ్మ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక వ్యక్తిగత సహాయకురాలినీ నియమించాలని లేఖలో తెలిపారు.

అయితే చిన్నమ్మ లేఖపై జైలు అధికారులు కంగారుపడుతున్నారట. ఏ హోదాలో ఆమెకు ఇవన్నీ సమకూర్చాలో తెలియక తలపట్టుకుంటున్నారట. శశికళ పొలిటికల్ లీడర్ కాదు. ప్రభుత్వ పదవిని అనుభవించిన వ్యక్తి కాదు. ఇటీవలే అన్నాడీఏంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కేవలం ఆ పదవిని చూసే ఇవన్నీ సమకూర్చాలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద చిన్నమ్మ జైల్లోకి కాలు మోపక ముందే జైలు అధికారులకు తన డిమాండ్లతో కూడిన జాబితాను పంపడం ఆశ్చర్యం వేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1